ETV Bharat / spiritual

ఫిబ్రవరిలో ముఖ్యమైన పండగలు - ఎన్ని ఉన్నాయో తెలుసా? - February 2024 Festivals

Festivals in February 2024: తొలి ఏకాదశితో మొదలయ్యే హిందూ పండగలు.. ఏడాది పొడవునా కొనసాగుతూనే ఉంటాయి. జనవరిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇప్పుడు ఫిబ్రవరిలోకి అడుగు పెట్టాం. మరి.. ఈ నెలలో ఎన్ని పండగలు ఉన్నాయో మీకు తెలుసా?

Festivals in February 2024
Festivals in February 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 2:07 PM IST

Festivals in February 2024: హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ నెలను మాఘ మాసం అని పిలుస్తారు. చలికి వీడ్కోలు పలికి వేసవి కాలానికి స్వాగతం పలికే మాసం ఇది. ఈ ఫిబ్రవరి నెలలో పండగలు తక్కువగా వచ్చినప్పటికీ.. వచ్చిన పండగల ప్రాముఖ్యత మాత్రం పెద్దదే. ఈ నెలలో వసంత పంచమి, రథసప్తమి, మాఘ పూర్ణిమతోపాటు అనేక పండుగలొచ్చాయి. ఆ వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..

ఫిబ్రవరి 6: షట్టిల ఏకాదశి

ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం నాడు షట్టిల ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది. ఈ రోజున శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. షట్టిల ఏకాదశి రోజున నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించడం వల్ల సుఖ సంతోషాలు పెరుగుతాయని పండితులు చెబుతారు. అలాగే నువ్వులను దానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం.

ఫిబ్రవరి 7: ప్రదోష వ్రతం

షట్టిల ఏకాదశి మరునాడు అంటే ఫిబ్రవరి ఏడో తేదీన ప్రదోష వ్రతం ఉపవాస దీక్ష పాటిస్తారు. ఈ దీక్ష చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పురాణాలు చెబుతున్నాయి. దీంతో చాలా మంది ఆరోజున ఉపవాసం ఉంటారు.

ఈ వినాయక మంత్రాలు పఠిస్తే - అన్నింటా విజయం మీదే!

ఫిబ్రవరి 9 : మాఘ అమావాస్య, మౌని అమావాస్య

ఫిబ్రవరి మాసంలో 9వ తారీఖు శుక్రవారం రోజు వచ్చే ఈ అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ పర్వదినాన శివుడిని ఆరాధించడం వల్ల జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున నదీ స్నానాలు చేయడం, దానధర్మాలు చేయడం వల్ల సుఖ శాంతులు లభిస్తాయని విశ్వసిస్తారు. అంతేకాకుండా వివాహిత స్త్రీలు.. తమ భర్త, పిల్లల క్షేమం కోసం ఉపవాసం ఉంటారు.

ఫిబ్రవరి 13 : వినాయక చతుర్థి

సంకష్ట చతుర్థి కృష్ణ పక్షంలో జరుపుకుంటే.. వినాయక చతుర్థి శుక్ల పక్షంలో జరుపుకుంటారు. ఈ రోజున వినాయక అవతారాన్ని పూజిస్తారు.

పెద్దలు ఎవ‌రికీ రుణ‌ప‌డ‌కూడ‌దంటారు- ఎందుకో తెలుసా?

ఫిబ్రవరి 14: వసంత పంచమి, సరస్వతీ పూజ

ఫిబ్రవరి 14న వచ్చే వసంత పంచమి రోజున సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సంగీతం, విద్య, కళలకు దేవత అయిన సరస్వతీ దేవికి ఈరోజున పూజలు నిర్వహిస్తారు. బాసరతోపాటు ఇతర సరస్వతీ దేవీ ఆలయాల్లో వసంత పంచమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 16: రథ సప్తమి

హిందువులకు ముఖ్యమైన పండగలలో రథసప్తమి ఒకటి. ఈరోజున సూర్య భగవానుడికి పూజలు నిర్వహిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. సూర్య భగవానుడు ఏడు గుర్రాలు కలిగిన రథంపై వెళతాడని నమ్ముతారు.

ఫిబ్రవరి 20: జయ ఏకాదశి

ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం నాడు జయ ఏకాదశి వచ్చింది. ఈ రోజున లక్ష్మీనారాయణులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పర్వదినాన ఉపవాసం ఉండి దీక్షను కొనసాగించి, దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చెబుతారు.

ఫిబ్రవరి 24: మాఘ పూర్ణిమ

మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున నదీస్నానాలు చేస్తారు. పురాణాల ప్రకారం, ఈ పర్వదినాన దేవుళ్లందరూ భూమిపైకి వచ్చి నీటిలో స్నానం చేస్తారని చాలా మంది నమ్ముతారు. ఇలా చేయడం వల్ల భగవంతుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

అయోధ్య వెళ్లాలనుకునేవారికి గుడ్​న్యూస్​- హైదరాబాద్ ​నుంచి డైరెక్ట్​ ట్రైన్​, పూర్తి వివరాలివే!

108 సంఖ్యకు ఉన్న ప్రాధాన్యం ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.