DoS And DonTs On Saturday : శనివారం ఈ తప్పులు అస్సలు చేయకండి. శనివారం ఇవి కొన్నా, ఎవరి దగ్గరి నుంచి తీసుకున్నా దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే! ఈ నేపథ్యంలో శనికి అంకితమైన శనివారం ఏ పనులు చేయవచ్చు? ఏం పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
శనిదేవుని వారం శనివారం
జ్యోతిష్య శాస్త్ర పండితులు శనివారం శనిదేవుని వారమని, ఈరోజుకు అధిపతి శని దేవుడని చెబుతుంటారు. అందుకే ఈరోజు చేసే పనుల్లో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంటారు.
శనిదేవుడు మేలు చేస్తాడా? కీడు చేస్తాడా?
శనిభగవానుడు నవగ్రహాల్లో ప్రధానమైన దేవుడు. సహజంగా అందరూ శని అంటేనే భయపడి పోతుంటారు. అయితే శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని, ఆయన చెడు చేసే వారికి చెడుగా, మంచి చేసే వారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారని పండితులు చెబుతారు.
శనివారం నూనె కొంటే రుణబాధలు
శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వుల నూనెను కొని ఇంటికి తీసుకు రాకూడదు. గుడిలో దీపం పెట్టాలనుకునే వారు దుకాణంలో కొనుక్కొని నేరుగా గుడికి వెళ్లాలి. నువ్వుల నూనె మాత్రమే కాదు ఏ నూనె కూడా శనివారం కొనరాదని పెద్దలు చెబుతారు. అలా కాకుండా శనివారం నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని పండితులు చెబుతున్నారు.
శనివారం నూనెను ఇచ్చి పుచ్చుకుంటే దరిద్రం
శనివారం నూనెను ఒకరి చేతి నుంచి ఇంకొకరు అందుకోవడం కూడా దారిద్ర్యానికి దారి తీస్తుందని పెద్దలు అంటారు.
ఉప్పు కొంటే ముప్పే!
అలాగే శనివారం ఉప్పు కొంటే కూడా ముప్పు తప్పదు. శనివారం రోజు ఉప్పు కొనకూడదు. శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన ఉప్పును శనివారం కొంటే దరిద్ర దేవతను ఇంటికి ఆహ్వానించినట్లే అని పండితులు చెబుతున్నారు.
శనివారం నువ్వులు కొంటే కష్టాలు కొన్నట్లే!
శనిదేవుని పూజలో ప్రధానంగా వాడే నువ్వులు శనివారం రోజు కొనరాదు. ఏ అవసరం కోసమైనా శనివారం నువ్వులు కొంటే అష్టకష్టాలు పడతారని శాస్త్రం చెబుతోంది.
శనివారం ఈ వస్తువులు కొన్నారో శనిబాధలు తప్పవు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం పత్తి, బొగ్గు, నల్లని వస్త్రాలు, ఇనుముతో తయారు చేసిన వస్తువులు కొనడం కానీ వేరొకరి నుంచి తీసుకోవడం కానీ చేయరాదు. అలాగే మినుములు కూడా కొనరాదు. మినపప్పు కొనవచ్చు కానీ నల్ల మినుములు కొనరాదు.
శనివారం ఇవి కొన్నారో జీవితంలో పురోగతి ఉండదు!
శనివారం చెప్పులు కానీ, బూట్లు కానీ కొంటే శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు. మన వృత్తి వ్యాపారాలలో పురోగతి నశిస్తుందని పండితులు సెలవిస్తున్నారు.
శనివారం ఇవి చేస్తే సకల శుభాలు!
శనివారం పేదలకు, వృద్ధులకు అన్నదానం చేయాలి. కాకులకు, నల్ల చీమలకు, కుక్కలకు ఆహరం పెట్టాలి. మినుములతో తయారు చేసిన పదార్ధాలను దానం చేయాలి. రావిచెట్టు కింద దీపం వెలిగించి నమస్కరించుకోవాలి. ఇలా చేస్తే శని దేవుడు ప్రీతి చెంది సకల శుభాలను ఇస్తాడు.
శుక్రవారం రోజు ఉప్పుతో 'ఐశ్వర్య' దీపం పెడితే డబ్బే డబ్బు! - Rock Salt Deepam Benefits
హనుమాన్ జయంతి ఎప్పుడో తెలుసా? - ఆ రోజున భక్తులు ఏం చేయాలంటే! - Hanuman Jayanti 2024 Date