ETV Bharat / spiritual

హోలీ రోజున ఈ వస్తువులు దానం చేస్తే - కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్టే! - Do Not Donate These Things On Holi

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 2:31 PM IST

Do Not Donate These Things On Holi : వాస్తు ప్రకారం.. హోలీ రోజున కొన్ని వస్తువులను దానం చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే కోరి కష్టాలను, నష్టాలను కొని తెచ్చుకున్నట్టే అవుతుందని అంటున్నారు. మరి, ఆ వస్తువులు ఏంటో మీకు తెలుసా?

Do Not Donate These Things On Holi
Do Not Donate These Things On Holi

Do Not Donate These Things On Holi : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరమూ ఫాల్గుణ మాసం చివరి పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 25 సోమవారం రోజున జరుపుకోనున్నారు. అయితే.. హోలీ పండుగ రోజున కొన్ని వస్తువులు దానం చేయకూడదట. ఆ రోజున దానం చేస్తే ఇబ్బందులు వస్తాయట! మరి.. ఆ వస్తువులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

తెల్లని వస్తువులు :
హోలీ పండుగ రోజున పాలు, పెరుగు, పంచదార వంటి తెల్లని వస్తువులను ఎవరికీ దానం చేయకూడదట. దీనివల్ల ఇంట్లో అశాంతులు కలుగుతాయని వాస్తు పండితులంటున్నారు. అలాగే ఇలా చేసిన వారికి జాతకంలో శుక్రుడి స్థానం బలహీన పడుతుందట. దీనివల్ల జీవితంలో అన్నీ కష్టాలు ఎదురవుతాయని చెబుతున్నారు.

డబ్బు :
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం హోలికా దహనం రోజున డబ్బును ఎవరికీ విరాళంగా ఇవ్వకూడదు. దీనివల్ల వారి ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందట. కాబట్టి, డబ్బులను ఎవరికీ దానంగా ఇవ్వకూడదట.

పైళ్లైన స్త్రీలు ఇవి దానం చేయకూడదు :
హోలీకా దహనం, హోలీ పండుగ రెండు రోజుల్లో.. పెళ్లైన స్త్రీలు పసుపు, కుంకుమ, బొట్టు, గాజులు, మేకప్‌ కిట్‌ వంటి ఇతర వస్తువులను దానం చేయకూడదట. దీనివల్ల వివాహ బంధంలో గొడవలు, కలహాలు కలుగుతాయి.

వస్త్రాలను దానం చేయకండి :
అలాగే ఈ రెండు రోజులలో పాత వస్త్రాలు, కొత్తవాటిని కూడా ఎవరికీ కూడా దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే దానం చేసిన వారి ఇంట్లో నుంచి లక్ష్మీదేవి దూరమవుతుందట. ఇంకా వారి జీవితంలో అశాంతి నెలకొంటుందని తెలియజేస్తున్నారు.

ఇనుము, ఉక్కుతో చేసినని :
హోలీ రోజున ఎట్టిపరిస్థితుల్లో కూడా ఇనుము, ఉక్కు లేదా స్టీల్ పాత్రలను ఎవరికీ దానం చేయకూడదు. దీనివల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందట. అలాగే వీటిని ఎవరి ఇంటి నుంచి కూడా తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు.

ఆవాల నూనె :
హోలికా దహనం, హోలీ పండగల ఆవాల నూనెను దానం చేయకండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల శని దేవుని కోపానికి బలవుతామని పండితులు తెలియజేస్తున్నారు.

నోట్ : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

హోలీ రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు - వాస్తు నష్టాలు గ్యారెంటీ! - Holi 2024 Vastu Tips

ఈ వాస్తు దోషాలు ఉంటే - అప్పుల్లో మునిగిపోవడం ఖాయమట! - Vastu Mistakes Can Drown Deep Debts

అద్దె ఇంట్లో వాస్తు చూసుకోవాల్సిందే! - లేదంటే ఆ సమస్యలు తప్పవట! - Vastu Tips for Rented Home

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.