ETV Bharat / spiritual

‘దీపావళి’ ఎలా మొదలైందో తెలుసా? - నరకాసురుడిని సత్యభామ వధించింది ఇక్కడే!! - DIWALI 2024 SPECIAL STORY

-నరక చతుర్దశి ఎలా మొదలైందో తెలుసా? -లక్ష్మీనారాయణులను పాటలీ పుష్పాలతో పూజలు చేసిన శ్రీ కృష్ణుడు సత్యభామ

Diwali  2024 Special Story
Diwali 2024 Special Story (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2024, 8:54 AM IST

Diwali 2024 Special Story: నరకాసురుణ్ణి సంహరించిన ఆనందంలో ప్రజలంతా ఆనందోత్సాహాలతో చేసుకొనే పండగ.. దీపావళి. ఆ తర్వాతి కాలంలో.. ఇది దీపాల పండుగగా, టపాసులు కాలుస్తూ ఇంటిల్లిపాది ఆనందంగా చేసుకొనే వేడుకగా మారింది. కాగా శ్రీకృష్ణుడు, సత్యభామ నరకుణ్ణి వధించారని అందరికీ తెలిసిందే. కానీ ఎక్కడ వధించారో చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే దీపావళి పర్వదినం వేళ ఆ విశేషాలు మీకోసం..

సత్యభామ యుద్ధం చేసింది ఇక్కడే: ద్వాపరయుగంలో నరకుడు ప్రాగ్నోషికపురం అనే ప్రాంతాన్ని పాలించేవాడు. శివుడి కోసం ఘోర తపస్సు చేసి, తల్లి వల్ల తప్ప మరొకరి వల్ల మృత్యువు సంభవించకూడదనే వరాన్ని పొందుతాడు నరకుడు. ఒకనాడు వేటకు వెళ్లగా జంతువుని చంపడానికి వేసిన బాణం గురితప్పి ద్విముఖుడు అనే బ్రాహ్మణుడికి తగులుతుంది. దీంతో అతడు మరణిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న నరకుడు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి పొందడానికి ఏం చేయాలో చెప్పాలని గురువును ఆశ్రయిస్తాడు. జరిగింది తెలుసుకున్న గురువు.. "కృష్ణానదీ తీరంలో భూమి నుంచి ఉద్భవించిన శివలింగం ఉంది. ఆ స్వామిని పుష్కరకాలం పాటు ఆరాధించడం ద్వారా ఈ దోషం నుంచి విముక్తి పొందగలవు" అని వివరాలు చెబుతాడు. దీంతో నరకుడు కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నడకుదురు చేరుకుని పృథ్వీశ్వరస్వామిని పూజిస్తూ ఉంటాడు. అప్పుడే తనకున్న రాక్షస ప్రవృత్తి వల్ల ఆ ప్రాంతంలోని మహిళలను బంధించి, హింసించసాగాడు. దీంతో భయభ్రాంతులకు గురైన మహిళలు.. తమను రక్షించాలని శ్రీకృష్ణుడిని వేడుకుంటారు. సత్యభామా సమేతుడై అక్కడకు వచ్చిన స్వామి.. మహిళలందరినీ ఆ రాక్షసుడి బారిన నుంచి రక్షిస్తాడు.

అందుకు ఆగ్రహించిన నరకాసురుడు శ్రీకృష్ణుడిపై యుద్ధానికి సిద్ధపడతాడు. ఆ యుద్ధంలో పరమేశ్వరుడి వరం వల్ల శ్రీకృష్ణపరమాత్ముడు కొద్దిసేపు స్పృహ కోల్పోతాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన సత్యభామ.. యుద్ధ రంగంలోకి దూకి నరకుడిని సంహరిస్తుంది. అందుకే ఈ ఆలయానికి నరకోత్తరక్షేత్రంగా పేరొచ్చింది. ఆశ్వయుజ శుద్ధ చతుర్దశినాడు నరకుని పీడ వదిలింది గనక ఆ రోజును నరక చతుర్దశి అని పిలుస్తారు. ఆరోజున ప్రజలంతా ఆనందోత్సాహాలతో బాణసంచా కాల్చారు. అలా దీపావళి పర్వదినం వచ్చింది. కాలక్రమేణా నరకొత్తూరు, నరకదూరుగా ప్రస్తుతం నడకుదురుగా ప్రసిద్ధి చెందింది. నరక సంహారానికి గుర్తుగా ఇప్పటికీ ఇక్కడ నరకచతుర్దశి నాడు నరకాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు.

నరకాసుర సంహారం అనంతరం శ్రీ కృష్ణుడు సత్యభామా సమేతుడై.. ఇక్కడ వెలిసిన లక్ష్మీనారాయణులను పాటలీ పుష్పాలతో పూజలు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అనంతరం శ్రీకృష్ణుడు.. దేవవనం నుంచి పాటలీ వృక్షాలను తెచ్చి నడకుదురులో నాటాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు పూజించినట్టు చెప్పే లక్ష్మీనారాయణుల ప్రతిమలు ఇక్కడి కార్తీక వనంలోని ఓ గుడిలో ఉన్నాయి.

అరుదైన పాటలీవనం: దేశంలో పాటలీ వృక్షాలు చాలా అరుదు. కాశీ, నడకుదురు ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు కాశీలో కూడా పాటలీ వృక్షాలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. పాటలీ వృక్షాలను వేరొకచోట నాటినా అవి పెరిగిన దాఖలాలు లేవు. కానీ.. ఈ ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ చాలా పాటలీ వృక్షాలు వనంలా పెరుగుతున్నాయి. కార్తిక మాసంలో పూసే పాటలీ పువ్వులతో పృథ్వీశ్వర స్వామికి పూజలు చేస్తారు భక్తులు. పృథ్వీశ్వరుని పూజకు కార్తిక మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఆలయం దగ్గరే ఉన్న కార్తిక వనంలో వందలాదిగా ఉన్న ఉసిరి చెట్లు వేలాది మందికి ఆతిథ్యాన్నిస్తాయి. కార్తికంలో ఇక్కడి వనాల్లో సహపంక్తి భోజనాలు చేస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో అరుదైన ఉసిరి, పాటలీ వృక్షాలతో నిండిన ఈ వనాల్లో భోజనాలు చేయడానికి చుట్టుపక్కల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వస్తుంటారు.

నడకుదురు ఎలా చేరుకోవాలి?: కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురులో ఉన్న శ్రీ పృథ్వీశ్వరస్వామి ఆలయం విజయవాడకు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి అవనిగడ్డకు (కరకట్ట ఎక్స్‌ప్రెస్‌) ప్రతి 30 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు సదుపాయం ఉంది. ఈ బస్సులో ప్రయాణించి మార్గ మధ్యలో నడకుదురు చేరుకోవచ్చు. అవనిగడ్డ వెళ్లే ఆర్టీసీ బస్సు ద్వారా విజయవాడ నుంచి ఉయ్యూరు, పామర్రు, కూచిపూడి, చల్లపల్లి మీదుగా కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

దీపావళి అర్ధరాత్రి ఈ ప్రత్యేక పూజ చేస్తే - ఏడాదంతా లక్ష్మీ దేవి ఆనంద తాండవం చేస్తుందట!

దీపావళి ఒక్కరోజు కాదు ఐదు రోజుల పండగని మీకు తెలుసా? - ఆ విశేషాలు మీకోసం!

దీపావళి రోజు ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి? - ఈ విషయాలు మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.