Ayodhya Pran Pratishtha Celebrations in Telangana : అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవ వేళ రాష్ట్రం శ్రీరామనామ స్మరణతో మార్మోగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, భద్రాద్రి ఆలయంలో లోకాభిరాముడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమకొండ జిల్లా పరకాలలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులు సీతారామలక్ష్మణ, ఆంజనేయస్వామి వేషాధారణాలతో పురవీధుల్లో తిరుగుతూ శోభయాత్ర నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో పంచముఖి హనుమాన్ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్వర్యంలో భక్తులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం భక్తుల రామనామ సంకీర్తనలు, భక్తిగీతాలతో మార్మోగింది.
రాముడు వచ్చేశాడు! తర్వాతేంటి? అందరికీ దర్శనం ఎప్పుడు? ఏ సమయంలో వెళ్లొచ్చు?
Pran Pratishtha Celebrations in Nizamabad : నిజామాబాద్‌లో అయోధ్య రామమందిరం ఆకృతిలో మహిళలు ముగ్గులు వేసి భక్తిని చాటుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని పలు ఆలయాల్లో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో ప్రారంభ వేడుకను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరల(Pran Pratishtha oon LED Screen) ద్వారా తిలకించారు. నిర్మల్ జిల్లాలోని పురాతన దేవరకోట శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీరాముని పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలోని వీర హనుమాన్ సేవ సంఘం ఆధ్వర్యంలో సీతారామ ఆంజనేయ పల్లకిసేవ నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ వేళ సంగారెడ్డి నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన సంబరాలు అంబరాన్నంటాయి. మిర్యాలగూడలోని అన్ని వైష్ణవ దేవాలయాలు రామనామ జపంతో మార్మోగిపోయాయి.
రామమందిర కార్మికులను గౌరవించిన మోదీ- పూల వర్షం కురిపించి కృతజ్ఞతలు
Ayodhya Ram Celebrations in Telangana : ఖమ్మం జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఎల్ఈడీ తెరపై వీక్షించిన భక్తులు అన్నదాన, భజన కార్యక్రమాలు నిర్వహించారు. కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురం హజరత్ నాగుల్ మీరా దర్గాలో సంప్రదాయ మంత్రోచ్ఛరణతో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో భవాని మందిర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా విగ్రహాలతో ఊరేగింపు చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని పట్టణ పురవీధుల్లో రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల వద్ద చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
'జనవరి 22 నవయుగానికి ప్రతీక- రాముడిని క్షమించమని కోరుతున్నా'
People Watch Pran Pratista Programme on LED Screens : జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు(Special Puja to Anjaneya at Khammam) నిర్వహించారు. జగిత్యాల జిల్లాలోని రేచపల్లిలో అయోధ్య రామమందిర ప్రారంభత్సోవాన్ని ఎల్ఈడీ తెరపై వీక్షించిన భక్తులు ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదాన, భజన కార్యక్రమాలు నిర్వహించారు. వరంగల్, ఆదిలాబాద్ మహబూబాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. భజనలు, కోలాటాలు, శాస్త్రీయ నృత్యాలతో శ్రీరామున్ని కీర్తించిన భక్తులు ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాన్ని కనులరా వీక్షించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఓ పాఠశాల విద్యార్థులు జై శ్రీరామ్ అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.