Avoid These Things in Bedroom: చాలా మంది వాస్తును బాగా నమ్ముతారు. ఇంటి నిర్మాణం నుంచి వస్తువుల సెట్టింగ్ వరకు అన్నింటా వాస్తుశాస్త్రాన్ని ఫాలో అవుతుంటారు. అయితే.. తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. బెడ్రూమ్లో ఉంచే కొన్ని వస్తువులు నెగెటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తాయట. ఇంట్లోనివారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయట. ఫలితంగా.. భ్యార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
షూస్, చెప్పులు : చాలా మంది కొత్త చెప్పులు, షూస్ కొన్నప్పుడు బెడ్రూమ్లో దాచుకుంటూ ఉంటారు. కానీ.. వాస్తుప్రకారం అలా ఉంచడం మంచిది కాదట. ఎందుకంటే అవి ప్రతికూల శక్తులను ప్రేరేపిస్తాయట. దీనివల్ల మానసిక క్షోభ, నిద్ర లేమి సమస్యలు తలెత్తవచ్చు అంటున్నారు వాస్తు నిపుణులు. కాబట్టి పడకగదిలో షూ రాక్ ఏర్పాటు చేసుకోవడం మానుకోవాలని సూచిస్తున్నారు.
మాసిన బెడ్ షీట్లు : వాస్తు ప్రకారం మీరు బెడ్రూమ్లో ఉంచకూడని మరో వస్తువు ఏంటంటే.. మాసిన దుప్పట్లు. చాలా మంది బెడ్షీట్లను ఎక్కువ కాలం ఉతకకుండా వాడుతుంటారు. అయితే.. మురికిగా మారిన బెడ్షీట్లు బెడ్రూమ్లో ఉంటే నెగటివ్ ఎనర్జీని కలిగిస్తాయంట. అదేవిధంగా నలుపు రంగు బెడ్‌షీట్ కూడా పడకగదిలో ఉంచకూడదని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇది అనేక వ్యాధులకు కారణం కావొచ్చని చెబుతున్నారు.
చీపుర్లు, మాప్లు : వాస్తు ప్రకారం పడకగదిలో చీపుర్లు లేదా రూమ్ క్లీన్ చేసే మాప్‌లను ఉంచకూడదు. ఇవి ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య విబేధాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు వాస్తు నిపుణులు. అలాగే పూజ గదిలో ముఖ్యంగా ఆగ్నేయం లేదా ఈశాన్య దిశలో ఇంటిని శుభ్రపరిచే సామాగ్రిని ఉంచవద్దని సలహా ఇస్తున్నారు.
రంగులు : బెడ్‌రూమ్ గోడలపై లైట్ బ్లూ, ఆకుపచ్చ వంటి రంగులను ఉపయోగించడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అవి కళ్లకు తేలికగా ఉంటాయి. అలాకాకుండా.. బెడ్రూమ్లో ఇతర ముదురు రంగులను ఎంచుకోవడం వల్ల నిద్ర సమస్యలు వస్తాయని, మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని అంటున్నారు. అదేవిధంగా వాస్తు ప్రకారం.. మాస్టర్ బెడ్‌రూమ్ తలుపులు, ఫర్నిచర్‌తో సహా మొత్తం తెలుపు, నీలం రంగు కాంబినేషన్లో ఉండడం మంచిదని సూచిస్తున్నారు.
ఇలా వాస్తుప్రకారం.. బెడ్రూమ్లో వస్తువులను అరేంజ్ చేసుకుంటే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ చేరకుండా ఉంటుందని చెబుతున్నారు. ఫలితంగా.. మీరు, కుటుంబ సభ్యులు ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషకరంగా గడుపుతారని సూచిస్తున్నారు.
ఈ టిప్స్ పాటిస్తే - రోజంతా హ్యాపీగా!
అలర్ట్ : ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - అయితే స్ట్రెస్ పెరగడం ఖాయం!