ETV Bharat / spiritual

అరుణాచల గిరిప్రదక్షిణకు - ఈ రోజుల్లో వెళ్తే కుటుంబానికి అంతా శుభమే! - ARUNACHALAM GIRI PRADAKSHINA DATES - ARUNACHALAM GIRI PRADAKSHINA DATES

Arunachalam Giri Pradakshina Dates : శివుడు అగ్నిలింగంగా అవతరించిన పవిత్ర ప్రదేశమే.. అరుణాచలం. అందుకే.. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం లభిస్తుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. మరి.. ఏ రోజుల్లో గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుందో మీకు తెలుసా?

Arunachalam Giri Pradakshina Dates
Arunachalam Giri Pradakshina Dates
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 11:06 AM IST

Arunachalam Giri Pradakshina Dates 2024 : దక్షిణ భారతంలోని తమిళనాడులో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది అరుణాచలం. దీన్ని తమిళులు.. తిరువణ్ణామలై అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న పెద్ద కొండని సాక్షాత్తూ శివలింగంగా భక్తులు భావిస్తారు. అందుకే అరుణాచలంలోని పరమేశ్వరుణ్ణి(Lord Shiva) దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇంతకీ.. 'గిరి ప్రదక్షిణ' ఏ రోజుల్లో చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఏడాది అనుకూలమైన రోజులేవి? ఎలా చేరుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పౌర్ణమి రోజుల్లో..

పౌర్ణమి రోజుల్లో అరుణాచ గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుందని, కోరిక కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. చంద్రుడు ఆ రోజు పదహారు కళలతో ప్రకాశిస్తూ ఉంటాడట. కాబట్టి, ఆ వెలుగులో గిరి ప్రదక్షిణ చేస్తే.. మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి :

  • గిరి ప్రదక్షిణం చేసే వారు పాదరక్షలు లేకుండా వెళ్లడం మంచిది.
  • చెప్పులు లేకుండా గిరి వాలం చుట్టి వస్తే పుణ్యప్రధమని భక్తులు విశ్వసిస్తారు.
  • బరువు ఎక్కువగా ఉండే బ్యాగులను తీసుకెళ్లకపోవడం మంచిది.
  • గిరి ప్రదక్షిణ చేయాలంటే దాదాపు 14 కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది.
  • వీలైతే ఉదయం 10 గంటలలోపు గిరి ప్రదక్షిణాన్ని ముగించుకుంటే మంచిది.
  • భక్తులు తమ వెంట పండ్లు, నిమ్మకాయలను తీసుకెళ్లడం ఉత్తమం.

Lord Shiva : శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు..?

ఈ ఏడాది గిరి ప్రదక్షిణకు మంచి రోజులు ఇవే : ఎక్కువ మంది గిరి ప్రదక్షిణ ప్రతినెలా పౌర్ణమి రోజుల్లో చేస్తుంటారు. ఇక ఈ ఏడాది(2024) ఏ నెలలో ఎప్పుడప్పుడు పౌర్ణమి తిథి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.

  • 2024, ఏప్రిల్​లో పౌర్ణమి తిథి.. 23వ తేది మంగళవారం ఉదయం 3.25 నిమిషాల నుంచి మరుసటి రోజు 24 వ తేది ఉదయం 5 గంటల 18 నిమిషాల వరకు ఉంది.
  • మేలో పౌర్ణమి 22వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటల 47 నిమిషాల నుంచి 23 వ తేది రాత్రి 7 గంటల 22 నిమిషాల వరకు ఉంది.
  • జూన్​లో పున్నమి 21వ తేదీ శుక్రవారం ఉదయం 7.31 నిమిషాల నుంచి 22 నాడు ఉదయం 6.37నిమిషాల వరకు ఉంది.
  • జూలైలో పౌర్ణమి తిథి 20 తేది శనివారం సాయంత్రం 5 గంటల 59 నిమిషాల నుంచి ఆదివారం సాయంత్రం 3 గంటల 46 నిమిషాల వరకు ఉంది.
  • ఆగష్టులో 19వ తేదీ సోమవారం ఉదయం 3 గంటల 4 నిమిషాల నుంచి అదే రోజు రాత్రి 11 గంటల 55 నిమిషాల వరకు పౌర్ణమి ఉంది.
  • సెప్టెంబర్​లో పౌర్ణమి 17 మంగళవారం ఉదయం 11 గంటల 44 నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల 4 నిమిషాల వరకు ఉంది.
  • అక్టోబర్​లో 16వ తేదీ బుధవారం రాత్రి 8 గంటల 40 నిమిషాల నుంచి తర్వాతి రోజు సాయంత్రం 4 గంటల 55 నిమిషాల వరకు పౌర్ణమి తిథి ఉంది.
  • నవంబర్​లో పౌర్ణమి 15వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటల 19 నిమిషాల నుంచి 16వ తేదీ మార్నింగ్ 2 గంటల 58 నిమిషాల వరకు ఉంది.
  • డిసెంబర్​లో పౌర్ణమి 14వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటల 58 నిమిషాలకు మొదలై 15నాడు మధ్యాహ్నం 2 గంటల 31 నిమిషాల వరకు ఉంది.

ఎలా చేరుకోవాలంటే : తిరుపతి నుంచి 193 కిలోమీటర్ల దూరంలో అరుణాచలం ఉంది. బెంగళూరు నుంచి 202 కిలోమీటర్ల దూరంలో.. చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

Success Secrets By Lord Shiva in Telugu: జీవితంలో విజయానికి.. మహా శివుడు చెప్పిన రహస్యాలివే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.