Two Constables Died In Road Accident : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను పరంధాములు, పూస వేంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. పరంధాములు సిద్దిపేటలోని రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగా దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పూస వేంకటేశ్వర్లు పని చేస్తున్నారు.
ఈ ఇద్దరు స్నేహితులు ఈసీఎల్‌లో జరుగుతున్న మారథాన్ రన్నింగ్‌లో పాల్గొనేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత జాలిగామ బైపాస్ వద్ద వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
అక్కడ ఉన్న స్థానికులు ఇంటికి సమాచారం ఇచ్చారు. ఇంటికి వారే పెద్దదిక్కు కావడంతో ఇరు కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువులు పలువురు పోలీస్ సిబ్బంది కన్నీరు మున్నీరయ్యారు. ప్రమాదానికి ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజీలను తనిఖీ చేస్తున్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి : కానిస్టేబుళ్ల మృతిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు.
యాదాద్రి జిల్లాలో చెరువులోకి దూసుకెళ్లిన కారు - ఐదుగురు యువకుల జల సమాధి
రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వారిపైకి దూసుకెళ్లిన లారీ - నలుగురు దుర్మరణం