ETV Bharat / politics

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం దక్కేదెవరికి - పాగా వేసిన ప్రధాన పార్టీలు - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Zaheerabad MP Seat Winning Chances 2024 : జహీరాబాద్‌ లోక్‌సభ స్థానంపై పాగా వేయాలని మూడు ప్రధాన పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ముందుగానే మూడు పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం రెండు ఉమ్మడి జిల్లాల కలయికతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Election Campaign in Zaheerabad
Zaheerabad MP Seat Winning Chances
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 6:43 AM IST

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం దక్కేదెవరికీ- పాగా వేసిన ప్రధాన పార్టీలు

Zaheerabad MP Seat Winning Chances 2024 : జహీరాబాద్‌ లోక్‌సభ స్థానంపై ప్రధాన రాజకీయ పార్టీలు గురిపెట్టాయి. 1952లో జహీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు కాగా ఈ ప్రాంతం కొంత కాలం మెదక్‌ లోక్‌సభ స్థానం పరిధిలో సాగింది. దేశవ్యాప్తంగా జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో జహీరాబాద్‌ కేంద్రంగా లోక్‌సభ స్థానాన్ని ఏర్పాటు చేశారు. దీని పరిధిలోకి సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌, ఆందోల్‌, నారాయణఖేడ్‌తో పాటు కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లు చేరాయి.

Zaheerabad MP Seat History : జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో 16,33,786 మంది ఓటర్లు(Zaheerabad Lok Sabha Voters) ఉండగా వీరిలో కన్నడ, మరాఠీ భాష మాట్లాడేవారు సుమారు 4 లక్షల మంది ఉన్నారు. జహీరాబాద్‌ శాసనసభ నియోజకవర్గంలోని న్యాల్‌కల్‌, జహీరాబాద్‌ మండలాలు, నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని మనూరు, కంగ్టి, నాగిల్‌గిద్ద మండలాల్లోని ఎక్కువ మంది ప్రజలు నిత్యం కన్నడ భాష మాట్లాడుతారు.

లోక్‌సభ ఎన్నికలకు పదునెక్కిన ప్రచారం - ప్రసంగాలతో జోరందుకున్న విపక్ష పార్టీలు - Lok Sabha Elections 2024

జుక్కల్‌ నియోజకవర్గంలోని అత్యధిక మంది మరాఠీకి ప్రాధాన్యత ఇస్తారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత మూడు సార్లు ఎన్నికలు జరగాయి. మొదటి సారి కాంగ్రెస్‌ నుంచి సురేష్‌ షెట్కార్‌, ఆ తర్వాత 2014, 2019లో ఎన్నికల్లో బీబీపాటిల్‌ బీఆర్ఎస్​ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇటీవల పార్టీకు రాజీనామా చేసి బీజేపీలో చేరి ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా టికెట్‌ దక్కించుకున్నారు.

Zaheerabad MP Candidates 2024 : జహీరాబాద్​ మొదటి ఎంపీ నారాయణఖేడ్‌(MP Narayankhed)కు చెందిన సురేష్‌ షెట్కార్‌ కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడగలరు. జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని మద్నూర్‌ మండలం సిర్పూర్‌కు చెందిన బీబీపాటిల్ తెలుగుతో పాటు మరాఠీ, కన్నడలో మాట్లాడగలరు. బీఆర్ఎస్​కు సంబంధించిన అభ్యర్థి గాలి అనిల్‌ కుమార్‌ కేవలం తెలుగులో మాత్రమే మాట్లాడగలగటంతో ఇతర భాషా ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేయగలరో వేచిచూడాల్సి ఉంది.

హోరెత్తుతున్న ఓరుగల్లు రాజకీయం - నాటి మిత్రులే నేడు ప్రత్యర్థులుగా! - LOK SABHA ELECTION 2024

Zaheerabad Lok Sabha Polls 2024 : జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దున ఉండటంతో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలు ఇక్కడ కనిపిస్తాయి. సరిహద్దు ప్రాంతాల్లోని చాలా మంది తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడుతుంటారు. జహీరాబాద్‌ శాసనసభ స్థానానికి కర్ణాటక సరిహద్దుగా ఉండగా, నారాయణఖేడ్‌కు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులు కలిగి ఉన్నాయి. జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అన్ని మతాలు, సామాజిక వర్గాలవారు నివసిస్తుంటారు. ఇక్కడ హిందువులు, ముస్లింలతో పాటు క్రిస్టియన్‌ సామాజిక వర్గానికి చెందినవారూ ఎక్కువగానే ఉన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్​ఎస్​ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా విస్తృతంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

బీబీపాటిల్‌ పార్టీ మారి టికెట్‌ తెచ్చుకున్నప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. బీఆర్ఎస్(BRS)​ నుంచి గాలి అనిల్‌ కుమార్‌ మెదక్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. ప్రాంతం కొత్తది కావడంతో స్థానిక క్యాడర్‌ని అనుసరిస్తూ కార్యకర్తలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటం, గతంలో చేసిన పనులే తమను గెలిపిస్తాయన్న నమ్మకంతో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌ ఆశాభావంతో ఉన్నారు.

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల హీట్ - ప్రచార వేగం పెంచిన పార్టీలు - LOK sabha Polls 2024

తెలంగాణలో లోక్​సభ ఎన్నికల హీట్ - ప్రచారాల్లో జోరు పెంచిన ప్రధాన పార్టీలు - LOK SABHA ELECTIONS 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.