YSRCP Social Media Activists Apologizes : సోషల్ మీడియాలో రాజకీయ నాయకుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా, మార్ఫింగ్ ఫొటోలతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేయడం, సభ్య సమాజం సిగ్గుపడేలా అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ విషయంలో పోలీసు శాఖ క్షేత్రస్థాయిలో దూకుడు పెంచింది. ఇప్పటికే కొందరిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. మరికొందరిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఫలితంగా వైఎస్సార్సీపీ పెద్దల అండదండలు చూసుకొని ఇప్పటి వరకు సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు, వీడియోలతో పేట్రేగిపోయిన ఉన్మాద మూకకు తత్వం బోధపడింది. పోలీసులు చట్ట ప్రకారం కేసుల నమోదు చేసి, అరెస్టులు చేస్తుండటంతో వారిలో భయం మొదలైంది. దీంతో క్షమించండి, తప్పుచేశామంటూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఉన్మాదుల పోస్టులు పెడుతున్నారు.
వైఎస్సార్సీపీ పెద్దలు ఆదేశిస్తేనే అసభ్య పోస్టులు పెట్టాను : ఈ తరుణంలో గత వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ నటి, వైఎస్సార్సీపీ సానుభూతిపరురాలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, వంగలపూడి అనితలతో పాటు వారి కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి దారితీసే విధంగా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే దెబ్బైపోతారు - కొత్త చట్టాలు అమలు!
ప్రస్తుతం అరెస్టు పర్వం కొనసాగుతుడంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నేతలు, వారి కుటుంబాల్లోని మహిళలపై నిత్యం అసభ్య పోస్టులతో చెలరేగిపోయిన ఆ నటి ఓ వీడియో విడుదల చేసింది. ఆమె ఎవరెవరిపైన అసభ్య వ్యాఖ్యలు చేశారో వారందరికీ పేరు పేరునా క్షమాపణలు చెప్పారు. తనను, తన కుటుంబ సభ్యులను ఏమీ చేయొద్దని, వదిలేయాలని కోరారు. మరికొంతమంది కూడా తాము చేసింది తప్పేనని క్షమించాలని కోరుతూ వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. వైఎస్సార్సీపీ పెద్దలు ఆదేశిస్తేనే అసభ్య పోస్టులు పెట్టామని, తమను వదిలేయాలని కోరుతున్నారు.
ఆ నటి సినిమా పరిశ్రమలో తనను శారీరకంగా ఉపయోగించుకొని అవకాశాలు ఇవ్వలేదని గతంలో ఆరోపించారు. హైదరాబాద్లో అప్పట్లో హల్చల్ చేశారు. తనకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలంటూ ఫిలిం ఛాంబర్ వద్ద నగ్న ప్రదర్శనకు చేశారు. అనంతరం ఆ విషయం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తరువాత చెన్నైకి వెళ్లారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ అనుకూలంగా వీడియోలు చేస్తోంది. ఆ పార్టీకి ఏ రాజకీయ నాయకుడు వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చట్టప్రకారం చర్యలు తీసుకుంటుండడంతో ఆ నటికి తత్వం బోధపడి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు.
సోషల్ మీడియాలో సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు - కేసులు నమోదు