YS Sharmila Comments on Jagan : కంటికి కనిపించని పొత్తును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. క్రైస్తవులపై దాడి ఘటనపై కూడా వైఎస్సార్సీపీ స్పందించలేదని విమర్శించారు. ఆదానీ, అంబానీలకు ప్రభుత్వ ఆస్తులను సీఎం దోచిపెట్టారని ఆక్షేపించారు. జగన్ బీజేపీ దత్తపుత్రుడని నిర్మలా సీతారామన్ చెప్పారని అన్నారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
మోదీ వారసుడిగానే జగన్ ఉన్నారని, వైఎస్‌ఆర్ వారసుడిగా కాదని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింటే, ఐదేళ్లుగా బీజేపీ పెద్దలు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అవినీతి గురించి ఆరోపణలు చేస్తున్నా, కేంద్రంలోని పెద్దలు చర్యలు తీసుకోకుండా ఎవరైనా అడ్డుపడ్డారా అని నిలదీశారు. కేంద్రంలోని కాగ్, ఈడీ సంస్థలు ఏం చేస్తున్నాయని అడిగారు. జగన్ మోహన్ రెడ్డికి ప్రధాని మోదీకి దత్తపుత్రుడు కాబట్టే చర్యలు తీసుకోవడానికి ఐదేళ్లుగా వెనుకంజ వేశారని షర్మిల దుయ్యబట్టారు.
నవ సందేహాలకు సమాధానమివ్వండి - ఏపీ సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల లేఖ - YS Sharmila Letter To CM Jagan
తండ్రి పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో పెట్టిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారని వైఎస్ షర్మిల అన్నారు. సీబీఐ విచారణ కావాలని అధికారంలో లేనప్పుడు అడిగారని, అధికారంలోకి రాగానే వద్దన్నారని దీనిపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తన భర్త చీకట్లో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని కలిశారనే అవినాష్ రెడ్డి ఆరోపణలను ఆమె ఖండించారు. అవినాష్ రెడ్డి చేసినట్లుగా మధ్య రాత్రి గొడ్డలి రాజకీయాలు చేసే అలవాటు తమకు లేదని కౌంటర్ ఇచ్చారు.
జగన్ వేసే బిస్కట్లకు అమ్ముడుపోయి ఆరోపణలు : తన భర్త బీజేపీ నేతను కలవలేదని, కలవరని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వారి వద్ద రుజువులు కూడా లేవని చెప్పారు. తనకు వెయ్యికోట్ల రూపాయలు పనులు ఇవ్వలేదనే కారణంతో విమర్శలు చేస్తున్నట్లు, తెలంగాణ నేత కొండా రాఘవరెడ్డి ఆరోపణలను సైతం షర్మిల ఖండించారు. జగన్ వేసే బిస్కట్లకు అమ్ముడుపోయి ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు.
ఎన్డీయే కూటమికి ఉత్తరాదిలో నూకలు చెల్లిపోయాయనే కారణంతో, ఇపుడు దక్షిణాదిపై బీజేపీ నేతలు దృష్టి సారించి జగన్పై ఆరోపణలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మద్యం కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
నవ సందేహాల'కు సమాధానమివ్వండి - సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల మరో లేఖ - YS Sharmila Letter to CM Jagan