ETV Bharat / politics

గుట్టల్ని కొట్టడం, పోర్టులు అమ్మడం, భూములు దోచేయడమే వైసీపీ విజన్: షర్మిల

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 3:41 PM IST

YS Sharmila Allegations on CM Jagan: పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా సీఎం జగన్ మోసం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక విశాఖకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

sharmila_on_jagan.
sharmila_on_jagan.

YS Sharmila Allegations on CM Jagan: సీఎం జగన్​కు విశాఖలో పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (APCC President YS Sharmila) విమర్శించారు. పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్​ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటమే మీ రోడ్ మ్యాప్ అని అన్నారు. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ప్లాంట్​​ను (Vizag Steel Plant) కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడమే సీఎం జగన్ విజన్ అని అన్నారు. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం వైసీపీ నాయకులకు, జగన్​కే సాధ్యమని విమర్శించారు. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను దోచేయడం వైసీపీ విజన్ అని అన్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న నేపధ్యంలో 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు మొదలు పెట్టారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

New Schemes of Congress: పేదరికం నిర్మూలనకు కాంగ్రెస్‌ పార్టీ నూతన పథకాలు అమలు చేస్తుందని షర్మిల తెలిపారు. ప్రతి కుటుంబానికి అండగా నిలవాలని ఇందిరమ్మ అభయం అమలు చేస్తామని ప్రతి పేద కుటుంబానికి ప్రతినెలా రూ.5 వేలు, మహిళ పేరిట రూ.5 వేల చెక్కు ఇస్తామని కాంగ్రెస్‌ గ్యారంటీ ఇస్తుందని షర్మిల తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇస్తే వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలన మీ ఇంటికి తీసుకు వస్తాం అని షర్మిల హామీ ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.