YSRCP Two MLCs in Legislative Council: రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైఎస్సార్సీపీ నేతల కదలికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ దిల్లీలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్తున్నామని సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నేతలతో కలిసి మంగళవారం దిల్లీకి వెళ్లారు. అయితే వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వంకా రవీంద్ర మాత్రం మంగళవారం శాసనమండలికి హాజరయ్యారు. దీంతో టీడీపీ, ఇతర పక్షాల కొందరు నేతలు 'ఇదేంటీ.. మీరు దిల్లీకి వెళ్లలేదా' అంటూ వారిని అడిగారు. వైఎస్సార్సీపీ సభ్యులంతా సభకు దూరంగా ఉండగా ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రం రావడం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్ష నేత హోదా ఇప్పించండి - హైకోర్టులో జగన్ పిటిషన్ - Jagan Petition in AP High Court