ETV Bharat / politics

'నల్గొండ ఖిల్లాలో విజయం ఎవరిది?- డిసైడ్ చేసేది ఈ కింగ్ మేకర్సే' - NALGONDA YOUNG VOTERS OPINION

author img

By ETV Bharat Telangana Team

Published : May 3, 2024, 2:22 PM IST

Youth Awareness on Lok Sabha Elections in Nalgonda : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ప్రధాన పార్టీలన్నీ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారితో పాటు 30 ఏళ్ల లోపు ఉన్న యువ ఓటర్లపై దృష్టి సారిస్తున్నాయి. వారిని ఆకర్షించేందుకు క్షేత్రస్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించాయి. యువత ఈసారి చాలా క్లారిటీగా ఉన్నట్లు కనిపిస్తోంది. తమ ఓటును సరైన రీతిలో ఉపయోగించుకుంటామని నేటి యువత చెబుతోంది.

Nalgonda Young Voters
Youth Awareness on Lok Sabha Elections (ETV BHARAT)
'ఎలాంటి తాయిలాలకు ఆశపడం- మా ఓటు మంచి చేసే వారికే' (ETV BHARAT)

Nalgonda Lok Sabha Young Voters : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 18 నుంచి 30 ఏళ్ల వయసు గల ఓటర్ల వాటా సుమారు 40 శాతంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో యువత పాత్ర కీలకం కానుంది. వీరి మద్దతు కూడగట్టేందుకు అధికార పార్టీ కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​, బీజేపీ పార్టీలు ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. వారి పరిధిలో కొత్తగా నమోదైన ఓటర్లు, 30ఏళ్ల వయసు వారి వివరాలు సేకరిస్తున్నారు. వారికి తాయిలాలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం యువత తమకే మద్దతుగా ఉందని ఎవరికి వారే అనుకుంటున్నారు.

Nalgonda Youth Talk on Lok Sabha Elections : యువత మాత్రం తమ ఓటును వృధాగా పోనివ్వమని ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుందని అంటున్నారు. సమాజాభివృద్ధికి తోడ్పాటందించే మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు వేస్తామని చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు పార్లమెంట్‌ స్థానాల పరిధిలో అధిక శాతం యువత చదువు, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు వీరి చిరునామాల సేకరణ ప్రక్రియను ప్రారంభించాయి.

"ఎవరైతే యువతకు ప్రాముఖ్యత ఇచ్చి ఉద్యోగాలు, అవసరమైన విద్యను అందజేస్తారో అలాంటి సరైన నాయకుడిని ఎన్నుకుంటాం. మా చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది. దాంతో ఎవరైతే సరిగా పని చేస్తారో, పరిపాలిస్తామని అనుకుంటున్నామో వారికే ఓటు వేస్తాం. రాజకీయ నాయకులు స్వలాభం కోసం ఇచ్చే తాయిలాలు చూసి ఓటు వేయం." - విద్యార్థులు, నల్గొండ

దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు- కొత్తగా లిస్ట్​లోకి 2 కోట్ల మంది యువత

Nalgonda Youth Voters Impact on Elections : నల్గొండ పార్లమెంట్‌ పరిధిలో మెత్తం 17,25,465 మంది ఓటర్లుండగా వీరిలో యువ ఓటర్లు 61,143 మంది ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటముల్లో వీరే కీలకపాత్ర పోషించారు. యువత మాత్రం రాజకీయ పార్టీలు ఇచ్చే తాయిలాలకు ఆశ పడమని తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే నాయకులకు మాత్రమే ఓటు వేస్తామని చెబుతున్నారు. ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకోమని తమకు మేలు చేసేవారికే ఓటు వేస్తామని లేదంటే నోటాకు వేస్తామని తేల్చి చెబుతున్నారు. మరో పది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో యువతీ, యువకులు తాయిలాలకు ఆశపడి ఓటు వేయవద్దని, నిజమైన నాయకుడిని ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో యువత ఓటే కీలకం

నవ సమాజ నిర్మాణానికి ఓటే ఆయుధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.