ETV Bharat / politics

రుణమాఫీ కాలేదని వేల సంఖ్యలో రైతులు ఫోన్లు చేస్తున్నారు : కిషన్‌రెడ్డి - Kishan Reddy On Rythu Runa Mafi - KISHAN REDDY ON RYTHU RUNA MAFI

Central Minister Kishan Reddy Fires on Congress Party : రుణమాఫీ కాలేదని రైతులు ఫోన్‌ చేసి చెబుతున్నారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి కాంగ్రెస్ పార్టీ​పై తీవ్రంగా స్పందించారు. రుణమాఫీకి ప్రాతిపదిక ఏంటో తెలియట్లేదని రైతులు చెబుతున్నట్లు వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో కిషన్​రెడ్డి పాల్గొని ఈ మేరకు మాట్లాడారు.

Kishan Reddy Comments on Rythu Runa Mafi Implementation
Cabinet Minister Kishan Reddy Fires on Congress Party (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 6:13 PM IST

Kishan Reddy Comments on Rythu Runa Mafi Implementation : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ ​రెడ్డి విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. కిషన్​రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 'హర్‌ ఘర్‌ తిరంగా’, స్థానిక సంస్థల ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ కార్యాలయంలో రుణమాఫీకి సంబంధించి కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్న ఆయన, దీనికి వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. రుణమాఫీ కాలేదని రైతులు ఫోన్‌ చేసి చెబుతున్నారని, రుణమాఫీ కాకపోవడంతో వారంతా ఆందోళనలో ఉన్నారని అన్నారు. రుణమాఫీకి ప్రాతిపదిక ఏంటో తెలియట్లేదని రైతులు చెబుతున్నట్లు వివరించారు.

వచ్చే నాలుగన్నరేళ్లు బీజేపీ నేతలు కష్టపడి పని చేయాలన్న కేంద్రమంత్రి, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 36 శాతం ప్రజలు ఓట్లు వేశారని గుర్తు చేశారు. ప్రజల తీర్పును సవాలుగా తీసుకొని అంకిత భావంతో పని చేయాలని నేతలకు సూచించారు. ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని మోదీ 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారని, ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.