ETV Bharat / politics

'భూమి నీదే కానీ, మేం రిజిస్ట్రేషన్​ చేయించుకుంటాం- నీదైతే నిరూపించుకో!' - Land Titling Right Act

Andhra Pradesh Land Right Act 2023 : బలవంతుడిదే అధికారం (Might is Right) అని చెప్పారు గ్రీకు తత్వవేత్త ప్లాటో. సాధారణ పౌరుడు బలవంతుడిని ఎదిరించాలంటే కోర్టులు, చట్టాలే మార్గం. కానీ, వాటి జోక్యాన్ని నివారించేలా బలవంతుడు కొత్త చట్టం తీసుకువస్తే సామాన్యుడి పరిస్థితి ఏమిటో ఊహించగలమా?! ప్లాటో చెప్పిన మాటలను నిజం చేస్తూ ప్రజలను వెర్రిపప్పలుగా చూస్తోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.

andhra_pradesh_land_right_act_2023
andhra_pradesh_land_right_act_2023
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 6:43 PM IST

Andhra Pradesh Land Titiling Act 2023 : భూమి ఒక భరోసా, ఆపదలో ఆసరా, ఆకలి తీర్చే అక్షయ పాత్ర. బిడ్డల ఉన్నత చదువులకైనా, ఇంట్లో ఎదుగుతున్న కూతురు వివాహానికైనా, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఊహించని ఆపద ఎదురైనా భూమి తానున్నానంటుంది. భూమి కంటికి కనిపించని ఆభరణం. ఇలా ఎన్నో అవసరాలు తీరుస్తూ, ఆకాంక్షలను నెరవేర్చే ఆ భూమి భద్రంగా ఉన్నప్పుడే కుటుంబానికి భరోసా. సన్ని, చిన్నకారు రైతులైనా, చిరుద్యోగులైనా గుండె మీద చెయ్యి వేసుకుని, కంటి నిండా నిద్రపోతున్నాడన్నా, నలుగురిలో తలెత్తుకుని గౌరవంగా బతకుతున్నాడన్నా భూమి ఉండడమే కారణం. కానీ, మన భూమిని మరొకరు కబ్జా చేస్తే! నిద్రపోతున్న వేళ రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్​ చేయించుకుంటే? వినడానికే భయంగా ఉంటుంది కదూ! కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం సామాన్యుడికి భూమిపై హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోంది. కోర్టులు, చట్టాలు ఉన్నా వాటికి అతీతంగా కొత్తగా భూమి హక్కు చట్టం (Andra Pradesh Land titling Act ) తీసుకొచ్చింది.

"భూమి నీదైతే నిరూపించుకో" ! - వెర్రిపప్పా.. అంటే 'బుజ్జినాన్నా' అని అర్ధం ! - Jana Sena Prudhvi Raj Ad Viral

జీవో 512 తీసుకువచ్చిన వైఎస్సార్సీపీ సర్కారు, భూ వివాదాల పరిష్కారానికి జిల్లాకు ఒక ట్రిబ్యునల్​ను ఏర్పాటుకు నిర్ణయించింది. టైటిల్​ రిజిస్టర్​ ఆఫీసర్ల ద్వారా వివాదాలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం చెప్తున్నా, కోర్టుల జోక్యం లేకపోవడం పలు అనుమానాలు, ఆందోళనలు రేకెత్తిస్తోంది. భూవివాదాల పరిష్కారానికి చట్టం తెలిసిన న్యాయ కోవిదులను జగన్‌ పక్కన పెట్టేశారు. ప్రభుత్వం నియమించే టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌(TRO) ఉంటారు. ఏ వ్యక్తినైనా టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిగా నియమించవచ్చని నిబంధనలు రూపొందించారు. అధికార పార్టీ అనుకూల వర్గాన్ని నియమించి భూముల పందేరానికి పాల్పడే ప్రమాదం లేకపోలేదు. నూతన భూ హక్కు చట్టం ద్వారా చిన్న, సన్నకారుల రైతులు నష్టపోతారని లాయర్లు గగ్గోలు పెడుతున్నారు. భూ సమస్యను కోర్టుల దృష్టికి తీసుకు రాకుండా ట్రిబ్యునల్​కు వెళ్తే అక్కడ అధికార పార్టీ నాయకులకే లబ్ధి జరుగుతుందని బల్లగుద్ది చెప్తున్నారు.

భూహక్కు చట్టంతో ప్రజలకు తీవ్ర నష్టం - వెంటనే రద్దు చేయాలంటూ న్యాయవాదుల నిరసనలు

జగన్​ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య హక్కు చట్టం-2023 గుట్టు విప్పుతూ జనసేన పార్టీ ఇటీవల విడుదల చేసిన ఓ వీడియో వైరల్​గా మారింది. ఓ సామాన్యుడి భూమిని కబ్జా చేసిన అధికార పార్టీ ప్రతినిధి (నటుడు పృథ్వీ) కొత్త చట్టం ద్వారా కోర్టులు తనను ఏమీ చేయలేవని చెప్తాడు. అధికార పార్టీ అనుకున్నదే చట్టం అంటూ సామాన్యుడిని హేళన చేస్తాడు. భూమి నీదైతే నిరూపించుకో అంటూ సవాలు విసురుతాడు. కానీ, సామాన్యుల చేతిలో ఓటు అనే ఆయుధం ఉందన్న విషయాన్ని మర్చిపోతాడు.

సూది మొన మోపినంత భూమిని కూడా ఇవ్వనన్నాడు భారతంలో దుర్యోధనుడు. అక్కడ మొదలైన మహాభారతం కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసింది. నూరుమంది కౌరవుల సంహారానికి బీజం వేసింది. కోర్టుల జోక్యం లేకుండా వైఎస్సార్సీపీ కొత్తగా తీసుకువచ్చిన భూ హక్కు చట్టం వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలిట యమపాశం కానున్నదా?! ఎన్నికల కురుక్షేత్రంలో జగన్ అరాచక​ పాలనకు అంతిమ గీతం పాడనున్నదా?

భూ హక్కు చట్టం అత్యంత ప్రమాదకరం - ప్రజలను చైతన్యం చేయాలి: మండలి బుద్ధప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.