ETV Bharat / politics

ఎమ్మెల్యే రఘురామ ​కేసు - సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్​కు ముందస్తు బెయిల్ నిరాకరణ - RAGHURAMA RAJU CASE - RAGHURAMA RAJU CASE

RAGHURAMA RAJU CASE : ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్​ టార్చర్​ కేసులో అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయ పాల్ కు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 20 కి వాయిదా వేసింది.

mla_raghurama_raju_case
mla_raghurama_raju_case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 12:31 PM IST

RAGHURAMA RAJU CASE : ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నగరం పాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయ పాల్​కు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. రఘురామకు కస్టోడియల్ టార్చర్​లో గాయాలైనట్లు గతంలో సుప్రీంకోర్టు అభిప్రాయ పడిందని సీనియర్ న్యాయవాది ఆదినారాయణ హైకోర్టుకు తెలిపిన వాదనను పరిగణలోకి తీసుకొని మధ్యంతర ముందస్తు బెయిల్ నిరాకరించింది. కస్టోడియల్ టార్చర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

'దాడి వెనక వారి హస్తం - బయట కారులో కూర్చొని పర్యవేక్షించారు' - Attack ON TDP Central Office Case

పోలీస్ కస్టడీ పేరిట తనపై హత్యాయత్నం జరిగిందని గుంటూరు జిల్లా పోలీసులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఐపీఎస్‌ పీవీ సునీల్‌కుమార్‌పై ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. తన పుట్టిన రోజు నాడే ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నించినందుకే అక్రమ కేసులు పెట్టారని, అరెస్టు చేసిన రోజే తనకు చివరి రోజు అవుతుందని అనుకున్నట్లు రఘురామ వెల్లడించారు.

ఎంపీగా ఉన్న తనను అరెస్టు సమయంలో కిడ్నాప్‌ తరహాలో వ్యవహరించారని, ఎక్కడా నిబంధనలు పాటించలేదని రఘురామ ధ్వజమెత్తారు. కస్టోడియల్‌ టార్చర్‌ ఘటనకు సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌, ఐపీఎస్‌ అధికారి సీతారామాంజనేయులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అప్పటి సీఐడీ అడిషనల్‌ ఎస్పీ విజయ్‌ పాల్‌ బాధ్యులని రఘురామ తెలిపారు. కోర్టు విచారణకు ఆదేశించినా అప్పటి గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా. ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారని తెలిపారు.

2021 మే 14వ తేదీన తాను హైదరాబాద్‌లోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకల్లో ఉండగా ఏపీ సీఐడీ పోలీసులు దాడి చేశారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. అరెస్టు చేసి గుంటూరులోని సీబీసీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నా వైద్యం, భోజనం సైతం ఏర్పాటు చేయలేదని తెలిపారు. రబ్బర్ బెల్ట్, లాఠీతో కొట్టడంతోపాటు శారీరక వేధింపులకు గురి చేశారని అవేదన వ్యక్తం చేశారు.

జగన్​ సెక్యూరిటీ పిటిషన్- 3 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు - jagan security petition

పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ - విచారణ వచ్చే వారానికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.