Chandrababu Challeng to Jagan : మళ్లీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్న జగన్ గత హామీలపై బదులిచ్చాకే బస్సెక్కాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. 5 ఏళ్ల పదవీ కాలాన్ని విధ్వంసాలకు, కక్ష రాజకీయాలకు, దోపిడీకి వెచ్చించిన ఏకైక సీఎం జగన్ రెడ్డి అని మండిపడ్డారు. 99 శాతం హామీల అమలు అనే జగన్ మాట బూటకమని ధ్వజమెత్తారు. విశ్వసనీయతపై అతని కబుర్లు అతిపెద్ద నాటకం అని దుయ్యబట్టారు. జగన్ మోసాలపై లోకేశ్ విడుదల చేసిన వీడియోను చంద్రబాబు రీట్వీట్ చేశారు. గత ఎన్నికలకు ముందు ప్రతి పక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ లోకేశ్ చేసిన ట్వీట్‌ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. జగన్ ఇష్టారాజ్యంగా ఇచ్చిన హామీలు విస్మరించారని లోకేశ్ ట్వీట్లో గుర్తు చేశారు. అందులో కొన్ని ఇవి..
బడుగులను గుమ్మం బయటే నుంచో బెట్టడమేనా జగన్ చేసే సామాజిక న్యాయం: నారా లోకేశ్
ఇంతకీ జగన్ ఇచ్చిన హామీలేమిటంటే! ప్రతీ రైతన్నకు బోర్లు వేయిస్తామని, రైతులకు అండగా 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పంటలు దెబ్బతినకుండా, గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ ఉంచేలా శీతలీకరణ గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తానని తెలిపాడు. రూ.4వేల కోట్లతో ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సాగు నీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పరుగులు తీయిస్తానని నమ్మబలికారు. కౌలుదారీ చట్టాన్ని ప్రక్షాళన చేయిస్తానని, ప్రతి మండల కేంద్రంలోనూ వృద్ధాప్య ఆశ్రమం ఏర్పాటు చేసి డాక్టర్లు, నర్సుల నియామకం పూర్తి చేస్తామని హామీఇచ్చారు. కియా పరిశ్రమను వెనక్కి పంపిస్తామని, పోలవరం నిర్వాసితులకు ఎకరాకు 19 లక్షలు రూపాయలు చెల్లిస్తామని అన్నారు. విశాఖ పరిధిలో ఉన్న అన్ని చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని, పెట్రోల్, డీజిల్ బిల్లులు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తగ్గిస్తామని చెప్పారు. బీసీలకు 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, రాజధానిని వాషింగ్టన్ డీసీలా కట్టిస్తామని జగన్ ప్రగల్భాలు పలికారు.
'జగన్ హ్యాండ్సప్, వైసీపీ ప్యాకప్' - వైరల్ అవుతున్న నారా లోకేశ్ ట్వీట్
మూడు నెలల్లో ఉక్కు ఫ్యాక్టరీ కట్టిస్తామన్న జగన్ మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని నేటికీ నెరవేర్చలేదు. నాయీ బ్రాహ్మణులకు 250 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని, ఐడీ కార్డులు ఇచ్చి వేతనాలు అందిస్తామని గొప్పలు చెప్పారు. సంగీత కళాశాలలు వాటికి అనుసంధానంగా నియామకాలుంటాని అన్నారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ ఇస్తామని, అప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తామని కోతలు కోశారు. ప్రతి పేదకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని చెప్పిన జగన్ ఏ ఒక్క కరెంటోడు మీ ఇంటికి రాడు అంటూ బీరాలు పలికారు. యాదవ కులస్థులను ఉద్దేశించి గొర్రెలు ఇవ్వడమే కాదు, వాటికి ఇన్సూరెన్స్ కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చి వెన్ను చూపారు. పశువుల అత్యవసర వైద్యం కోసం 102 నంబర్ అంబులెన్స్‌లు తీసుకువస్తామని మర్చిపోయారు.
నాడు ఆర్థిక రాజధానిగా విశాఖ - నేడు అఘాయిత్యాలకు క్యాపిటల్: లోకేశ్
కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇస్తున్న దానికంటే ఒక రూపాయి అదనంగా పాడి రైతులకు ఎక్కువ రేటు చెల్లిస్తామని చెప్పారు. నాయీ బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, రజకులు, కుమ్మరులు అందరినీ చట్ట సభల్లోకి తీసుకొస్తామని, విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ ఇస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్, కార్పొరేట్ జ్యువెలరీ వాళ్లకి మంగళ సూత్రాలు తయారు చేసే హక్కు కల్పిస్తామని అన్నారు. ఎమ్మెల్యే టికెట్ రాని బీసీ కులాల వారికి ఎమ్మెల్సీ, సంచార జాతులకు ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. మీ పిల్లలు ఇంజినీర్, డాక్టర్ చదువుతారో మీ ఇష్టం.. దగ్గరుండి నేను చదివిస్తా అంటూ గొప్పలు చెప్పి మర్చిపోయారు.
అన్నదాతల ఆత్మహత్యలపై లోకేశ్ ఆవేదన- మూడు నెలల్లో ప్రజా ప్రభుత్వం వస్తుందని రైతులకు భరోసా