Telangana MLA Quota MLC Candidates Unanimous : శాసనసభ కోటా ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మహేశ్‌కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసినందున 2 స్థానాలకు ఇద్దరు మాత్రమే నామపత్రాలు దాఖలు చేశారు. బరిలో ఎవరూ లేకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్(MLC Balmuri Venkat) ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శాసనసభ రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ప్రకటించారు.
"ఎమ్మెల్సీలుగా మహేశ్ కుమార్ గౌడ్, వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడం సంతోషంగా ఉంది. మహేశ్‌కుమార్ పదవి ఆశించకుండా పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. బల్మూరి వెంకట్ చేసిన ఉద్యమాలను పార్టీ గుర్తించింది. పని చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉంటుంది." - శ్రీధర్‌బాబు, ఐటీ శాఖ మంత్రి
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్
Minister Sridhar Babu on MLC Unanimous : మంత్రి శ్రీధర్‌బాబు, పార్టీ నాయకులతో కలిసి అసెంబ్లీకి వెళ్లిన మహేశ్‌కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు. ఏకగ్రవంగా ఎన్నికైన ఇద్దరికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీధర్‌బాబు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్‌లో గుర్తింపు ఉంటుందన్నారు. మహేష్ కుమార్ గౌడ్(MLC Mahesh Kumar Gowd) ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీ గెలుపు కోసం పని చేశారని, బల్మూరి వెంకట్ చేసిన ఉద్యమాలను పార్టీ గుర్తించిందని మంత్రి పేర్కొన్నారు. పని చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉంటుందని వెల్లడించారు. ఇరువురు ఈ నెల 18న కాంగ్రెస్ పార్టీ తరుఫున నామినేషన్ దాఖలు చేశారు. నోటిఫికేషన్ విడుదల అవ్వక ముందు నుంచి ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్‌కే దక్కుతాయని పార్టీ నాయకులు భావించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ - ఛాన్స్ కొట్టేసింది వీరే!
"కాంగ్రెస్‌లో పనిచేస్తే పదవులు వస్తాయి. ప్రజాసమస్యల పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను. నాకు ఎమ్మెల్సీ అయ్యేందుకు సహకారం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు." -మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ
"చిన్నవయసులో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. విద్యార్థి, నిరుద్యోగులకు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా ఉంటాను. నాతో పాటు తొమ్మిది సంవత్సరాలు ప్రతి ఉద్యమంలో పాల్గొన్న ఎన్ఎస్యుఐ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదములు." - బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ
గవర్నర్ కీలక నిర్ణయం - నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి బ్రేక్