ETV Bharat / politics

బ్యాలెట్ పేపర్‌లో మార్పు కోరుతూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిటిషన్ - ఈసీకి హైకోర్టు ఆదేశం - CHEVELLA BJP CANDIDATE BALLOT PAPER - CHEVELLA BJP CANDIDATE BALLOT PAPER

Telangana HC on Chevella BJP Candidate Ballot Paper Change : బ్యాలెట్ పేపర్​లో మార్పులు చేయాలంటూ చేవెళ్ల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి సమర్పించిన వినతిపత్రంపై హైకోర్టులో విచారణ జరిగింది. బ్యాలెట్​ పేపర్​లో మార్పులు చేయాలని ఈ దశలో ఈసీకి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆదేశించింది.

High Court on  Ballot Paper Name Issue
Konda Vishweshwar Reddy Ballot Paper Change Issue (ETV BHARAT)
author img

By ETV Bharat Telangana Team

Published : May 3, 2024, 9:06 AM IST

HC Reaction on BJP Candidate Ballot Paper Change : బ్యాలెట్ పేపర్‌లో మార్పులపై చేవేళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమర్పించిన వినతి పత్రాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. చేవేళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకే పేరుతో ఇద్దరు నామిషన్ వేసినందున ఒక్కో పేరు మధ్య కనీసం 10 నంబర్ల వ్యత్యాసం ఉంచుతూ బ్యాలెట్ పేపర్‌లో మార్పు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

Konda Vishweshwar Reddy Ballot Issue : పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి పిటిషనర్‌తో పాటు 46 మంది నామినేషన్ దాఖలు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పిటిషనర్ పేరు ఉన్న మరో వ్యక్తి కూడా నామినేషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు. జాబితాలో సీరియల్ నెంబరు 2గా పిటిషనర్ పేరు ఉందని, అయిదో పేరుగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తండ్రి కాంతారెడ్డి అని ఉందని వివరించారు. పిటిషనర్ ప్రచారానికి వెళుతుంటే 5వ నెంబరు అభ్యర్థా అని అడుగుతున్నారని తెలిపారు. రెండు పేర్లు ఒకేచోట ఉన్నట్లయితే ఓటర్లు అయోమయంలో పడే అవకాశం ఉందన్నారు. తమ పేర్ల మధ్య కనీసం 10 నెంబర్లు వ్యత్యాసం ఉండేలా బ్యాలెట్ పేపరులో మార్పులు చేసేలా ఆదేశించాలని కోరారు. దీనికి సంబంధించి గత నెల 30న ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించామని తెలిపారు.

కొండా విశ్వేశ్వర్​రెడ్డి వినతిపత్రంపై చర్యలు తీసుకోండి - ఈసీకి హైకోర్టు ఆదేశం - konda vishweshwar reddy

Konda Name Confusion in Chevella Ballot Papers : ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున పిటిషనర్ వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు బ్యాలెట్ పేపర్‌లో మార్పులు చేయాలంటూ ఎన్నికల సంఘానికి ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే పిటిషనర్ సమర్పించిన వినతి పత్రంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సూచిస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేసింది.

తెలంగాణలోనే ధనిక అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్​ రెడ్డి రికార్డ్! - ఆస్తుల విలువ అక్షరాలా రూ.4,490 కోట్లు - Telangana Richest MP Candidate

చేవెళ్ల లోక్​సభలో త్రిముఖ పోటీ - ఎవరు గెలుస్తారో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.