Telangana Congress MP Candidates Meet CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా విజయం సాధించిన నాయకులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, సురేశ్ షెట్కార్, మంత్రులు కొండా సురేఖ, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని నాయకులు శాలువాలతో, జ్ఞాపికలతో సన్మానించారు. ఎంపీలుగా గెలిచిన నాయకులను, వారిని గెలిపించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేలను, ఇంఛార్జి మంత్రులను, నియోజక వర్గా ఇంఛార్జిలను ముఖ్యమంత్రి అభినందించారు. అధికార పార్టీ ఎంపీలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
Congress MP Seats Won in Telangana : లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు దక్కించుకుంది. బీజేపీ కూడా 8 స్థానాలను గెలుచుకుంది. ఎంఐఎం పార్టీ ఒక్క స్థానంలో జెండా ఎగరవేసింది. బీఆర్ఎస్ ఒక్క స్థానం దక్కలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 40.10 శాతం, బీజేపీకి 35.08 శాతం, బీఆర్ఎస్కి కేవలం 16. 68 శాతం ఓట్లు వచ్చాయి. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, వరంగల్, పెద్దపల్లి, భువనగిరి, జహీరాబాద్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది.
జహీరాబాద్ ,పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థుల ఘన విజయం
Telangana Congress MPs : ఖమ్మంలోని కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. 4,67,000పైగా ఓట్ల ఆధిక్యంతో విజయకేతనం ఎగరవేశారు. జహీరాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 45 వేలకు పైగా మెజార్టీతో బీబీ పాటిల్‌పై విజయం సాధించారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1.26 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మహబూబాబాద్‌లో హస్తం పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ బీఆర్ఎస్ అభ్యర్థిపై 3,24,000 పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. వరంగల్‌లో కడియం కావ్య రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. నల్గొండలో రఘువీర్ రెడ్డి 5.37 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. నాగర్‌కర్నూల్‌లో మల్లు రవి 88 వేలకు పైగా మెజార్టీతో గెలిచారు. భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి 1.95 లక్షలకు పైగా ఆధిక్యంతో విజయం సాధించారు.