Telangana Congress Joinings : రాబోయే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా హస్తం పార్టీలో చేరికలు, గులాబీ పార్టీలో చీలికలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ దిశగానే పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు.
తాజాగా ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్(Allu Arjun) మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్ సునీతా, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య చర్లపల్లి బీఆర్‌ఎస్ కార్పొరేటర్ శ్రీదేవి, ఫ్రొఫెసర్ బానోత్ రమణ నాయక్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరందరికీ గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపదాస్ మున్షీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఇతర నేతలంతా అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు.
Patnam Sunita Mahender Reddy Join in Congress : అంతకు ముందు సునీతా మహేందర్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ మేరకు లేఖను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఆమె తన రాజీనామా లేఖను పంపారు. ఇవాళ మాజీ ఎమ్మెల్యే, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్ అనితారెడ్డి, జీహెచ్‌ఎంసీ ఉప మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి దంపతలు కూడా ఇవాళ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. కానీ వారు నలుగురు పార్టీలో చేరలేదు. మరో వైపు మునుగోడు నియోజక నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి దీపాదాస్ మున్షీతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. రేపో మాపో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
ongress Election Strategy : మొదట్లో లోకసభ ఎన్నికల తరువాత చేరికలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికీ, తాజా రాజకీయ పరిణామాలతో పార్టీ వైపు చొరవ చూపుతున్న నాయకులను చేర్చుకోవాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇదే అంశాన్ని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను ఏఐసీసీ(AICC) దృష్టికి తీసుకెళ్లి అనుమతి పొందినట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వం దుబారా ఖర్చులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది : శ్రీధర్‌బాబు
ఇప్పటికే బీఆర్‌ఎస్ నాయకుడు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన బీఎస్పీ నేత నీలం మధు, తన అనుచరులతో కలిసి గురువారం గాంధీభవన్‌కు వచ్చి, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆప్ మాజీ నాయకురాలు ఇందిరాశోభన్ కూడా దీప దాస్‌మున్షీ సమక్షంలో తిరిగి హస్తం గూటికి చేరారు.
BRS Leaders Jump to Congress : ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్, బీజేపీలకు(BJP Leaders) చెందిన కొందరు ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ నాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలకు చెంది దాదాపు 16 మంది ప్రజాప్రతినిధులు హస్తం పార్టీలోకి రావడానికి మొగ్గు చూపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. వీరు కాకుండా, మరో 20 మందికిపైగా కార్పొరేటర్లు కూడా సంప్రదిస్తున్నట్లు సమాచారం.
లోక్‌సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌లో చేరికల జోరు - ఆ వ్యూహంలో భాగమేనా!
యువతలో స్ఫూర్తి నింపేందుకే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు : రేవంత్‌రెడ్డి