Telangana BJP Lok Sabha Second List Release : దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలు ఉండగా తొలి జాబితాలో 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, 72 మందితో రెండో జాబితా(BJP Second List)ను విడుదల చేసింది. ఈ రెండో జాబితాలో తెలంగాణ నుంచి మొత్తం ఆరుగురు అభ్యర్థులను ప్రకటించారు. మెదక్ నుంచి రఘునందన్‌రావు పేరు ప్రకటించగా, మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, ఆదిలాబాద్ నుంచి గోడెం నగేశ్, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి సైదిరెడ్డి, మహబూబాబాద్ నుంచి సీతారం నాయక్ పోటీలో ఉన్నారు. రెండు జాబితాల్లో కలిపి తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో 15 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. ఇంకా ఖమ్మం, వరంగల్ స్థానాలను మాత్రమే బీజేపీ పెండింగ్‌లో పెట్టింది.
మొదటి జాబితా(TS BJP First List)లో పెండింగ్‌లో ఉంచిన ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని ఎంపీ సోయం బాపూరావుకు ఇవ్వకుండా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన గోడెం నగేశ్ పార్టీ అధిష్ఠానం ఇచ్చింది. అలాగే బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్‌కు మహబూబాబాద్ లోక్‌సభ టికెట్‌ను కన్ఫామ్ చేసింది. అనుకున్నట్లుగానే మెదక్ నుంచి అసెంబ్లీ ఎన్నికలో ఓటమి పాలైన రఘునందన్‌రావుకు అవకాశం ఇచ్చారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి డీకే అరుణ పోటీ చేయనున్నారు. ముందు నుంచి అనుకున్నట్లుగానే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.
బీజేపీ అభ్యర్థులు :
- మెదక్- రఘునందన్‌రావు
- మహబూబ్‌నగర్- డీకే అరుణ
- ఆదిలాబాద్- గోడెం నగేశ్
- పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్
- నల్గొండ – సైదిరెడ్డి
- మహబూబాబాద్- సీతారాం నాయక్
'రాజ్యాంగ సవరణ కోసమే బీజేపీ 400 సీట్ల లక్ష్యం!'- ఎంపీ వ్యాఖ్యలపై ఖర్గే ఫైర్
BJP Lok Sabha First List : తొలి జాబితాలో 195 మందితో అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ తెలంగాణకు సంబంధించి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేయగా, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ నుంచి భరత్ ప్రసాద్, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, భువనగరి నుంచి బూర నర్సయ్య గౌడ్, హైదరాబాద్ నుంచి డాక్టర్ మాధవి లత, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్లను బీజేపీ ప్రకటించింది.
మొదటి జాబితాలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన జహీరాబాద్, నాగర్ కర్నూల్ ఎంపీలు బీబీ పాటిల్, రాములు లకు పార్టీ టికెట్లు ఇచ్చింది. నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కుమారుడు భరత్ ప్రసాద్‌కు సీటును కేటాయించింది. మొదటి జాబితాలో చోటు దక్కని రఘునందన్‌రావు, డీకే అరుణ రెండో జాబితాలో పేర్లను ప్రకటించింది.
ఆసక్తిరేపుతున్న ఆదిలాబాద్ ఎంపీ సీటు - జోరందుకున్న రాజకీయ వలసలు
కొలిక్కివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు - సుదీర్ఘ చర్చల అనంతరం ప్రకటన