ETV Bharat / politics

ఆ స్థానం వద్దనుకుని రాజీనామా చేసిన బీఆర్​ఎస్​ మళ్లీ పోటీ చేయడం ఎందుకు? : తీన్మార్​ మల్లన్న - Graduate MLC By election Campaign - GRADUATE MLC BY ELECTION CAMPAIGN

Graduate MLC By election 2024 in Telangana : బీఆర్​ఎస్​ పార్టీ పట్టభద్రుల స్థానం వద్దనుకుని రాజీనామా చేశారు, మళ్లీ ఇప్పుడు పోటీ చేయడమేంటని కాంగ్రెస్​ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న ప్రశ్నించారు. కాంగ్రెస్​కు ప్రజలు దేవుళ్లని చెప్పారు. కేసీఆర్​కు మాత్రం ప్రజలంటే బానిసలని విమర్శించారు. హనుమకొండలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Graduate MLC By election 2024 in Telangana
Graduate MLC By election 2024 in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 5:08 PM IST

Teenmar Mallanna Graduate MLC By election Campaign : కాంగ్రెస్​కు ప్రజలు దేవుళ్లు అయితే కేసీఆర్​కు ఆయన కుటుంబానికి మాత్రం బానిసలని ఖమ్మం-వరంగల్​-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్​ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న అన్నారు. ఎప్పుడూ ప్రజలంటే వారికి చిన్నచూపేనని హనుమకొండలో జరిగిన ఆత్మీయ సమావేశంలో చెప్పారు. పట్టభద్రుల స్థానం వద్దనుకుని రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయడమెందుకని ఆయన ప్రశ్నించారు.

అహంకారంతో తనను విమర్శిస్తూ ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ విద్యార్థులను అవమానించిన కేటీఆర్​కు ఓటు ద్వారా పట్టభద్రులు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్​ఎస్​ పని అయిపోయిందని ఎవ్వరూ వారి వెంట ఉండే ప్రసక్తి లేదని చెప్పారు. ఎన్నికల ఫలితాల తరవాత కేసీఆర్​తో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు జైలుకు పోవడం ఖాయమని చెప్పారు. కేటీఆర్​ పట్టభద్రులను ఓటు అడగడం కాదు కదా వరంగల్​ నగరంలోకి అడుగు ఎలా పెడతారో చూస్తానంటూ హెచ్చరించారు. జూన్​ 4వ తేదీ వరకు ఎన్నికల కోడ్​ ఉండడం వల్ల కేటీఆర్​ మాటలు అలా సాగుతున్నాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తర్వాత ఆయనను జైలులో పెడతామని తీన్మార్​ మల్లన్న స్పష్టం చేశారు.

బీఆర్​ఎస్​ పట్టభద్రుల స్థానం వద్దనుకుని రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయడమేంటి? : తీన్మార్​ మల్లన్న (ETV Bharat)

"కేసీఆర్​కు ప్రజలంటే బానిసలు లెక్క కనిపిస్తారు. కానీ కాంగ్రెస్​ పార్టీకి ప్రజలంటే దేవుళ్లు, ఓటర్లు, మహరాజులు లెక్క కనిపిస్తారు. వాళ్లకు మాకు ఉన్న తేడా అది. ఇప్పుడు ఉపఎన్నికలు ఎందుకు వచ్చాయి. బీఆర్​ఎస్​ పార్టీ మాకు ఈ పదవి వద్దని చెప్పినందుకు వచ్చింది. మాకు పట్టభద్రులు అవసరం లేదంటే వచ్చింది. కేటీఆర్​ ఏమంటారు వాళ్ల అభ్యర్థి పిట్స్​ పిలానీలో చదివాడు అంట వాళ్ల అభ్యర్థి. నేను జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నాను అంట. కేసీఆర్​ ఇళ్లంతా దొంగలముఠానే. మీ అందరికీ చర్లపల్లి జైలునే దిక్కు అవుతుంది." - తీన్మార్​ మల్లన్న, కాంగ్రెస్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి

గ్రాడ్యుయేట్ ఉపఎన్నికపై పార్టీలు ప్రచారం : అయితే ఇప్పటికే ప్రధాన పార్టీలు మూడు ఖమ్మం-వరంగల్​-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికపై దృష్టి పెట్టాయి. ఎవరి ప్రచారంలో వారు నిమగ్నమై ఉన్నారు. శనివారంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థులు పట్టభద్రుల ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈనెల 27న ఎన్నికల పోలింగ్​ జరగనుంది. జూన్​ 5వ తేదీన ఓట్ల లెక్కింపు, అదే రోజు గెలిచిన అభ్యర్థిని ప్రకటించనున్నారు.

ప్రశ్నించే గొంతుక అన్న తీన్మార్ మల్లన్న - హమీల అమలును ఎందుకు అడగటం లేదు : రాకేశ్ రెడ్డి - BRS mlc candidate Campaign

ఎమ్మెల్సీ ఉపఎన్నికపై కాంగ్రెస్ కేడర్‌ క్రియాశీలకంగా పనిచేయాలి : రేవంత్‌ - CM REVANTH ZOOM MEET on Election

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.