ETV Bharat / politics

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ 'దివాకరం ది క్యాషియర్‌' షార్ట్ ఫిలిం - సోషల్‌ మీడియాలో వైరల్‌ - TDP DIVAKARAM THE CASHIER

TDP Release Divakaram The Cashier Telugu Short Film: ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలెంత నష్టపోయారో చూపుతూ తెలుగుదేశం రూపొందించిన 'దివాకరం' షార్డ్‌ ఫిల్మ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. "ది క్యాషియర్‌" అనే ట్యాగ్‌తో విడుదలైన ఈ చిత్రానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. చిత్రంలో ఏం ఉందో మనమూ ఓ లుక్కేద్దాం.

TDP Release Divakaram The Cashier Telugu Short Film

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 10:15 AM IST

TDP Release Divakaram The Cashier Telugu Short Film : అయిదేళ్ల జగన్‌ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో పన్నులు, ధరల పెంపు ద్వారా ఒక్కో కుటుంబంపై ఎంత భారం పడిందో వివరిస్తూ తెలుగుదేశం పార్టీ రూపొందించిన 'దివాకరం' షార్ట్‌ ఫిల్మ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. 'ది క్యాషియర్‌' అనే ట్యాగ్‌లైన్‌తో 8 నిమిషాల నిడివిగల ఈ వీడియో వివిధ వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అజయ్‌ అమృత్‌, అనిల్‌ దర్శకత్వంలో హేమంత్‌ ప్రధాన పాత్రధారిగా నటించగా హాస్యనటుడు నారాయణస్వామి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. శనివారం విడుదలైన వీడియో సాయంత్రానికే 10 లక్షల వీక్షణలు దాటిందని వారు వివరించారు. చిత్రంలో ఏం ఉందో మనమూ ఓ లుక్కేద్దాం.

'యువత మేలుకో - చంద్రన్నను ఎన్నుకో - భావితరాల భవిష్యత్తు కోసం'

హేమంత్‌: రోజూ నువ్వు తాగే మందు క్వార్టర్‌ రేటు గతంలో ఎంత ఉండేది? ఇప్పుడెంత?

శ్రీను: గతంలో రూ.80. ఇప్పుడు రూ.200. రూ.120 పెరిగింది.

హేమంత్‌: నెలకు, ఏడాదికి, అయిదేళ్లకు ఎంత పెరిగినట్లు?

శ్రీను: నెలకు రూ.3,600, ఏడాదికి రూ.43,200, అయిదేళ్లలో రూ.2,16,000.. అయ్యబాబోయ్‌! అదనంగా ఇంత కట్టామా?

దివాకరం షార్డ్‌ ఫిల్మ్‌ కథ : బ్యాంకు క్యాషియర్‌గా పని చేసే దివాకరం అందరికీ ఉచితంగా డబ్బు ఇస్తున్నారంటూ వెంకీ బృందం డప్పులతో ప్రచారం చేస్తుంది. దీంతో గ్రామస్థులంతా బ్యాంకు దగ్గరకు పరుగు తీయడంతో చిత్రం ప్రారంభం అవుతుంది. తాను ఎవరికీ ఉచితంగా డబ్బు ఇవ్వలేదని, వెంకీ అనే వ్యక్తి తన డబ్బు తానే డ్రా చేసుకుని తీసుకెళ్లాడని దివాకరం చెబుతాడు. గ్రామస్థులంతా వెంకీ దగ్గరకెళ్లి 'నీ డబ్బు నీకిచ్చిన దివాకరానికి ఎందుకు పాలాభిషేకం చేస్తున్నావు' అని ప్రశ్నిస్తారు. దీంతో అతను 'అమ్మఒడి (Amma Vodi), రైతు భరోసా, ఆటోడ్రైవర్ల ఖాతాల్లో డబ్బులు వేసినప్పుడు మీరు జగన్‌కు పాలాభిషేకాలు చేశారు కదా? ఆ డబ్బు ఏమైనా సాక్షి మీడియా (Sakshi Media), భారతీ సిమెంట్‌, లోటస్‌పాండ్‌ ప్యాలెస్‌ అమ్మేసి ఇచ్చిన డబ్బులా? మరెందుకు పాలాభిషేకం చేశారు?' అంటూ నిగ్గదీయడంతో వారికి నోటమాట రాదు.

సినిమాలోనూ రాజధాని పేరు వింటే జగన్ ఉలిక్కిపడుతున్నారు: నారా లోకేశ్

ఒక్కో కుటుంబానికి ఇచ్చింది గోరంత దోచుకున్నది కొండంత : మద్యం తాగే ఒక్కో వ్యక్తి నుంచి అయిదేళ్లలో సీఎం జగన్‌ ప్రభుత్వం ఎంత దోచిందో మందుబాబు నోటితోనే చెప్పించారు. టచూశారా? ధర పెంచడం ద్వారా మద్యం తాగే ఒక వ్యక్తి నుంచే అయిదేళ్లలో రూ.2.16 లక్షలు దోచుకున్నారు. పెట్రోలు, డీజిల్‌, ఇసుక ధరలు, బస్‌, విద్యుత్తు ఛార్జీలు, ఇంటిపన్ను, చెత్తపన్ను, రోడ్‌ ట్యాక్స్‌, ఫైబర్‌నెట్‌ ఛార్జీలు ఇలా పెంచిన వన్నీ లెక్కేస్తే అయిదేళ్లలో ఒక్కో కుటుంబం నుంచి దోచింది అక్షరాలా రూ.10 లక్షలు నవరత్నాల పేరుతో కుటుంబానికి ఇచ్చింది రూ.లక్షే' అని కథానాయకుడు చెప్పే సంభాషణలు జగన్‌ పాలనలో దోపిడీని కళ్లకు కట్టాయి.

బటన్లు నొక్కడానికే సీఎం అయ్యారా? : 'అభివృద్ధి చేయడం రాదు, రాజధాని కట్టలేరు, పోలవరం పూర్తి చేయలేరు. ప్రత్యేక హోదా తీసుకురాలేరు. అలాంటి వారికి ఓటెలా వేస్తార్రా' అని కథానాయకుడి పాత్రధారి వేసే ప్రశ్నలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. 'ఈ మాత్రం బటన్‌ నొక్కడానికి బామ్మ చాలదా? సీఎం అనేవారు ఒకరు కావాలా?' అంటూ ముక్తాయించారు.

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ "దివాకరం ది క్యాషియర్‌" షార్ట్ ఫిలిం - సోషల్‌ మీడియాలో వైరల్‌

నాలుగున్నర ఏళ్లలో జగన్ రెడ్డి అరాచక పాలనే రాజధాని ఫైల్స్ సినిమా: దేవినేని ఉమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.