ETV Bharat / politics

పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం- చివరి జాబితాలో టిక్కెట్లు దక్కిన నేతల్లో ఆనందం - TDP Lok Sabha Candidates

TDP Lok Sabha Candidates Celebrations: తెలుగుదేశంలో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. తుది జాబితా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. నాలుగో జాబితాలో చోటు దక్కించుకున్న నేతలు, వారి అనుచరులు పలు చోట్ల బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు.

TDP Lok Sabha Candidates Celebrations
TDP Lok Sabha Candidates Celebrations
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 9:36 PM IST

TDP Lok Sabha Candidates Celebrations : వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పోటీచేసే స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలకు రేసు గుర్రాలను ఖరారు చేసింది. పెండింగ్‌లో ఉన్న 4 లోక్‌సభ స్థానాలకు, మిగతా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. నాలుగో జాబితాలో చోటు దక్కించుకున్న నేతలు, వారి అనుచరులు పలు చోట్ల బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు.

మాగుంట అనుచరుల సంబరాలు : ఒంగోలు పార్లమెంట్‌ తెలుగుదేశం అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించడంతో ఆయన నివాసం వద్ద పార్టీ శ్రేణులు, మాగుంట అనుచరులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడ చేరుకొని సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సంబరాల్లో టిడిపి కార్యకర్తలు శ్రేణులు అనుచరులు పాల్గొన్నారు.

టీడీపీ రెండో జాబితా విడుదల - అభ్యర్థుల సంబరాలు - గెలుపుపై ధీమా

కార్యకర్తకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం : కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున విజయనగరం ఎంపీ టిక్కెట్ కేటాయింపుపై కలిశెట్టి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో కుటుంబంతో కలసి కేక్‌కట్‌ చేశారు. ఎంపీ టిక్కెట్ కేటాయించిన సందర్భంగా కుటుంబ సమేతంగా ట్రస్ట్ భవన్​లోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. సాధారణ కార్యకర్తకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

దశాబ్దాలుగా తెలుగు దేశం పార్టీ బీసీలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందన్న కలిశెట్టి అప్పలనాయుడు కింది స్థాయి నుంచి వచ్చిన సాధారణ కార్యకర్తకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించడం పార్టీ నిబద్ధత, సిద్ధాంతాలకు నిదర్శనని అన్నారు. చంద్రాబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న ఆయన , బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతలను కలుపుకుంటూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు.

టీడీపీ, జనసేన కూటమిలో జోష్‌- అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో నేతల సంబరాలు

అసెంబ్లీ అభ్యర్థులను కలుపుకొని పోతాం : కడప ఎంపీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున భూపేష్ రెడ్డి పేరును ప్రకటించడంతో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అభిమానులు, కార్యకర్తలతో కోలాహలంగా మారింది. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి కార్యకర్తలు హాజరై పూలమాలలు, శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనను తెలుగుదేశం పార్టీ కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై ఆ పార్టీ నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులను కలుపుకొని ఎంపీగా గెలిచేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ వేడుకలు - TDP 42nd Foundation Day

గెలుపు గుర్రాలకు అసెంబ్లీ, లోక్​ సభ టికెట్లు ప్రకటించిన చంద్రబాబు - అంబరాన్నంటిన సంబరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.