ETV Bharat / politics

వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది - అందుకే టీడీపీ నేతలపై కుట్రలు: చంద్రబాబు - TDP ON JAGAN STONE PELTING CASE - TDP ON JAGAN STONE PELTING CASE

TDP Leaders Fires on Stone Pelting Case: సీఎం జగన్ గులకరాయి డ్రామాలో బలహీన వర్గాలకు చెందిన యువకులను బలి చేస్తున్నారని తెలుగుదేశం ధ్వజమెత్తింది. ఎన్నికల్లో సానుభూతి కోసం చేస్తున్న కుట్రల్ని తెలుగుదేశం చూస్తూ ఊరుకోబోదని ఆ పార్టీ నేతలు అన్నారు.

chandrabau fire on ysrcp
chandrabau fire on ysrcp
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 12:41 PM IST

Updated : Apr 17, 2024, 1:28 PM IST

TDP Leaders Fires on Stone Pelting Case : సీఎంపై రాయి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలైందని చంద్రబాబు అన్నారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో టీడీపీ నేతలపై వైసీపీ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. సీఎంపై రాయి ఘటనలో బొండా ఉమను ఇరికించే కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుచేసే అధికారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం వల్ల కుట్రలు పెంచుతున్నారని, హత్యాయత్నం అంటూ తెదేపాపై బురద వేయాలని యత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు. వైకాపా ప్రయత్నాలను ప్రజలు ఛీత్కరిస్తున్నారని తెలిపారు. నాలుగు రోజులైనా ఘటనపై పోలీసులు ప్రకటన చేయలేదన్నారు. నిందితులంటూ వడ్డెర కాలనీ యువకులను తీసుకుపోయారని చంద్రబాబు తెలిపారు. సీఎం జగన్ గులకరాయి డ్రామాలో బలహీన వర్గాలకు చెందిన యువకులను బలి చేస్తున్నారని టీడీపీ ధ్వజమెత్తింది. ఎన్నికల్లో సానుభూతి కోసం చేస్తున్న కుట్రల్ని తెలుగుదేశం చూస్తూ ఊరుకోబోదని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు.

మీరే బాధ్యత వహించాలి : సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ రెడ్డి కుట్ర చేశాడని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో కోడికత్తి డ్రామాలో ఒక దళిత బిడ్డను ఐదేళ్ల పాటు జైలు పాలు జేశారని మండిపడ్డారు. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన సతీష్ అనే అమాయకపు యువకుడిని ఇరికిస్తున్నారని దుయ్యబట్టారు. కిరాయి ఇస్తామని తీసుకెళ్లి ఇవ్వకుండా ఉంటే కడుపులో మండి గులకరాయి విసిరాడని అచ్చెన్నాయుడు విమర్శించారు. దీనికి టీడీపీకి సంబంధం ఏంటని, తమపై నెట్టడానికి సిగ్గనిపించటం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడికత్తి డ్రామా సమయంలో అధికారంలో ఉన్నవారే బాధ్యత వహించాలన్నారన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న మీరే బాధ్యత వహించాలని అచ్చెన్న అన్నారు.

మా పిల్లలు ఎక్కడ ? - వదిలిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: వడ్డెర కాలనీ వాసులు - cm jagan stone pelting case

వైఎస్సార్సీపీ ఓటమి తప్పదు : జగన్‌పై గులకరాయి దాడి కేసులో కుట్ర జరుగుతోందని టీడీపీ నేత పట్టాభి రామ్ ధ్వజమెత్తారు. తెలుగుదేశం నేతలను ఇరికించాలని చూస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. నాటకాలు అని ప్రజలకు స్పష్టంగా అర్ధమైందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి తప్పదని పేర్కొన్నారు.

గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ కుట్ర:టీడీపీ

ముఖేష్‌కుమార్‌ మీనాకు ఫిర్యాదు : డీజీపీ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాకు టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. సీఎం జగన్​పై గులకరాయి దాడి కేసులో టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావును ఇరికిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగంగా ఫిర్యాదు చేసున్నారని ఆరోపించారు. విజయవాడ సీపీ వైసీపీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల వేళ రాజకీయాలకు తావులేకుండా ఉండాలని వర్ల రామయ్య కోరారు.

క్వార్టర్ మేటర్ - ఇస్తానన్న రూ.350 ఇవ్వకపోతే మండదా!: లోకేశ్​ ట్వీట్​ - LOKESH ON STONE ATTACK ON JAGAN

తెలుగుదేశం క్యాడర్​పై అక్రమ కేసులు : గులకరాయి కేసులో పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో తెలుగుదేశంపై కుట్ర పన్నారని తెలుగుదేశం నేత కేశినేని చిన్ని ఆరోపించారు. బోండా ఉమాను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న విజయవాడ పోలీసులు తెలుగుదేశం క్యాడర్​పై అక్రమ కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. అమాయకులైన బీసీ యువకుల్ని కొట్టి బెదిరించి వారితో బోండా ఉమా పేరు చెప్పించాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో జగన్ దళిత యువకుడు శ్రీనివాస్​ను తన రాజకీయ కుట్రకు పావులా వాదుకున్నాడని ఇప్పుడు వడ్డెర కులస్తుల జీవితాలు నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌పై రాయితో దాడి చేస్తే హత్యాయత్నమా? - అదే ప్రతిపక్ష నేతపై జరిగితే కాదా? ఇదేం లాజిక్ కాంతిరాణా! - Stone Attack On CM Jagan

Last Updated : Apr 17, 2024, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.