TDP Leaders Fire on YSRCP leaders : ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దల డైరెక్షన్‌లోనే తాయిలాలను డంప్ చేస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రేణిగుంట గోదాంలో వైఎస్సార్సీపీకి సంబంధించిన డంప్ బయటపడినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇలాంటి డంప్‌లు రేణిగుంటలో 4 ఉన్నాయని తెలుగుదేశం నేతలు సాక్ష్యాధారాలతో సహా నిరూపించినా అధికారులు స్పందించకపోవడం వెనుక తాడేపల్లి పెద్దల ఒత్తిళ్లు ఉన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తాయిలాల మాటున ఓటర్లను ప్రభావితం చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇద్దరిని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని తేలడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. తెలుగుదేశం ఫిర్యాదుతో ఎట్టకేలకు తాయిలాల డంప్‌ను పట్టుకున్నారని ఇసుక, లిక్కర్ లో జగన్ దోచుకుని ఎన్నికల్లో పంచేందుకు సిద్ధంచేసిన డబ్బుల డంప్‌ను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కేజీ బంగారం ఇచ్చినా ప్రజల్లో నెలకొన్న ప్రజాగ్రహ జ్వాలలను అడ్డుకోవడం సాధ్యం కాదని జగన్ గుర్తించాలని హితవు పలికారు.
ఇంటింటి ప్రచారానికి సువిధ పోర్టల్‌లో దరఖాస్తు తప్పనిసరి: ఈసీ - Suvidha Portal For campaign
రేణిగుంట గోదాములో దొరికిన డంప్‌పై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తి తెలుగుదేశం అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీజ్ చేసిన తాయిలాల డంప్ ను తెలుగుదేశం నేతలతో కలిసి బొజ్జల పరిశీలించారు.
YSRCP Leaders are Violating the Election Eode : అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పలువురు ఎంఎల్ఓలు, వాలంటీర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వజ్రకరూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా స్థానిక వాలంటీర్లు ఎమ్మెల్యే అభ్యర్థితో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఉరవకొండ 11వ వార్డులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు విద్యుత్ స్తంభాలు, వాటర్ ట్యాంకులను సైతం వదలకుండా స్టిక్కర్లు అతికించటంపై స్థానికులు మండిపడ్డారు.
యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు - చూసీచూడనట్లు ఉంటున్న అధికారులు - YSRCP Election Code Violations
సత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఈసీ నిబంధనలను ఉల్లంఘిస్తూ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను పావులుగా వాడుతున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటివద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. దాన్ని ఆసరాగా తీసుకున్న వైఎస్సార్సీపీ నేతలు వాలంటీర్ల సహాయంతో వృద్ధుల ఓటరు కార్డుల జిరాక్స్‌లను సేకరిస్తున్నారు. కదిరి మున్సిపాలిటీలోని 17వ వార్డులో వృద్ధుల ఓటరు జిరాక్స్ సేకరిస్తుండగా తెలుగుదేశం కౌన్సిలర్ సావిత్రమ్మ నిలదీశారు. స్థానికులు కూడా వచ్చి నిలదీయడంతో వాలంటీర్ పొంతన లేని సమాధానమిచ్చారు.
Election Code in Andhra Pradesh : ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు వైఎస్సార్సీపీ కార్యాలయంలో వాలంటీర్లతో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను వాలంటీర్లే తీసుకోవాలని నాయకులు సూచించారు. జగన్‌ను మరోసారి సీఎం చేసేందుకు ప్రతి వాలంటీరు తమ పరిధిలోని కుటుంబ సభ్యుల నుంచి ఓట్లు వేయించాలని సూచించారు.
విశాఖ జిల్లా తగరపువలసలో భీమిలి వైఎస్సార్సీపీ అభ్యర్థి అవంతి, చీపురుపల్లి అభ్యర్థి బొత్స సత్యనారాయణ నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మీపురం వాలంటీర్ ఆవాల గౌరీశంకర్ పాల్గొన్నారు. దీనిపై ఆయనను ప్రశ్నించగా తాను సోషల్ మీడియా మండల కన్వీనర్ గా వ్యవహరిస్తున్నానని ఆ హోదాలోనే సమావేశానికి హాజరైనట్లు బుకాయించారు. పద్మనాభం మండలం బాంధేపురంలో అవంతి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి.