Chandrababu Praja Galam Public Meeting in Puttur : యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చదువుకున్న యువతకు ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? యువతకు ఉద్యోగాలు రావాలంటే ఎన్డీయేకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. యువత మేలుకోవాలని, రోడ్ల మీదకు రావాలని అన్నారు. జగన్ పాలనలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయామని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే మూడు పార్టీలు కలిసి నడుస్తున్నాయని చంద్రబాబు పువరుద్ఘాటించారు. ఈ ఎన్నికల యుద్ధంలో ఎన్టీఏ కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.
Chandrababu Election Campaign : ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పే వ్యక్తి జగన్ అని, ఆయనో అబద్ధాల కోరు, బోగస్ సర్వేలు చేయిస్తారని రాజకీయాలకు పనికిరాడని ఎద్దేవా చేశారు. పేదల మనిషి ఎవరో పెత్తందారు ఎవరో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. తాము ప్రారంభించామనే అన్న క్యాంటీన్లు రద్దు చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు తీసుకొస్తామని ప్రకటించారు. టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే పొత్తు పెట్టుకున్నామని, కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదేళ్ల ప్రజల ఆవేదన వచ్చే ఎన్నికల్లో అగ్నిగా మారాలని అన్నారు.
కూటమి అధికారంలోకి రాగానే నెలకు రూ.4 వేల పింఛన్: చంద్రబాబు - Chandrababu Tour in Kuppam
పేదలను నిరుపేదలుగా మార్చిన పెత్తందారు జగన్ : మేం ఉన్నప్పుడు ఐదేళ్లపాటు కరెంట్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. పేదల కష్టాలు ఏ మాత్రం తెలియని వ్యక్తి జగన్ అని, రూ.60ల మద్యాన్ని రూ.200లకు అమ్ముతున్నారని తెలిపారు. ఈ ఐదేళ్లలో మీ ఆదాయం పెరిగిందా.. తగ్గిందా? పేదలను నిరుపేదలుగా మార్చిన పెత్తందారు జగన్ అని నిప్పులు చెరిగారు. పేదల జీవితాల్లో వెలుగులు చూపించే బాధ్యత తనది భరోసా ఇచ్చారు. మహిళలను వేధించిన వారు బాగుపడినట్టు ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆడబిడ్డ నిధి ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని, అన్నదాత కింద రైతుకు ఏటా రూ.20వేలు ఇస్తామని, బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల పాటు కరెంటు ఛార్జీలు పెరగవని, చేనేత కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ తెస్తామని, నగరిలో ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత తనదని ప్రకటించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే రోజాపై నిప్పులు చెరిగారు. నగరి నియోజకవర్గమంతా అరాచకాలతో నింపేశారని మండిపడ్డారు.
ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు - ప్రచారానికి సిద్ధమైన జగన్, చంద్రబాబు - Political Heat in AP