Chandrababu fire on YSRCP's politics of violence : రాష్ట్రంలో రాజకీయ హింస, శాంతి భద్రతలపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే దృష్టి పెట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి వైఎస్సార్సీపీకి అత్యంత అనుకూలమైనవారేనని ఆయన పేర్కొన్నారు. సన్నిహిత సంబంధాలున్న ముగ్గురు ఎస్పీల అండచూసుకునే వైసీపీ నేతలు, గూండాలు చెలరేగుతున్నారని ఆయన ఆరోపించారు. కుర్చీ దిగిపోయే ముందూ వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. గిద్దలూరులో తెలుగుదేశం కార్యకర్త మూలయ్య, నంద్యాలలో ఇమామ్ హుస్సేన్ హత్యను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. మరో 50 రోజుల్లో కుర్చీ దిగి ఇంటికి పోయే ముందు కూడా జగన్ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ నేతపై వైసీపీ కార్యకర్తల దాడి, అదే పార్టీ ఎమ్మెల్యే పరామర్శ - ఇదెందయ్యా ఇది
ఓటమి భయంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న వైసీపీ మూకలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజాగళం సభకు వచ్చారన్న కారణంతో గిద్దలూరు నియోజకవర్గం, గడికోటకు చెందిన మూనయ్యను గొడ్డళ్లతో నరికి దారుణంగా చంపేశారని ఆరోపించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం, చాగలమర్రిలో ఇమామ్ హుస్సేన్ అనే 21 ఏళ్ల యువకుడిపై కత్తులతో దాడి చేసి బలి తీసుకున్నాయన్నారు. మాచర్లలో టీడీపీ కార్యకర్త సురేష్ కారును తగలబెట్టారన్నారు. ఈ మూడు ఘటనలపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఎన్నికల ముంగిట పెచ్చురిల్లుతున్న రాజకీయ హింస, శాంతి భద్రతల పరిస్థితిపై ఈసీ సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ధర్మవరంలో జనసేన రాష్ట్ర నాయకుడిపై వైసీపీ వర్గీయుల దాడి...
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గుంటుపల్లి నాగేశ్వరరావు మృతి పట్ల పార్టీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. గురజాల నియోజకవర్గానికి చెందిన నాగేశ్వరరావు ఇటీవల అనారోగ్యానికి గురై కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ పదవులతో పాటు, రాష్ట్ర స్థాయిలో నాగేశ్వరరావు నాయకత్వం వహించారని చంద్రబాబు అన్నారు. పార్టీ క్రమశిక్షణా సంఘం జాతీయ సభ్యులుగా సేవలందించారని అన్నారు. నాగేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు పేర్కొన్నారు.
ఓటమి భయంతోనే టీడీపీ నేతలపై వైసీపీ దాడి : మునిరత్నంపై దాడిని ఖండించిన లోకేశ్
ఏపీలో రాజకీయ హింస, శాంతి భద్రతలపై దృష్టి సారించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని ఎన్నికల సంఘానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
టీడీపీ సానుభూతిపరురాలిపై వైఎస్సార్సీపీ నేతల దాడి- వీడియో వైరల్