ETV Bharat / politics

వైసీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబుపై రాళ్లదాడులు అనేకం - పైగా బాబుపైనే కేసులు - Stone Attacks on Chandrababu

Stone Attacks on Chandrababu During YCP Govt: విశాఖ జిల్లా గాజువాక ప్రచార సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగంతుకులు రాళ్లు విసిరారు. ఐదేళ్లలో చంద్రబాబు లక్ష్యంగా రాళ్లదాడి జరగడం ఇదే తొలిసారి కాదు జనంలోకి వెళ్లిన పలు సందర్భాల్లో వైసీపీ ప్రేరేపిత దుండగులు రాళ్లు, కర్రలతో విరుచుకుపడిన ఉదంతాలెన్నో ఉన్నాయి. అన్నిసార్లూ ఘటనల వెనుక వైసీపీ నాయకులే ఉన్నారని స్పష్టమవుతున్నా సీఎం జగన్‌ ఒక్కసారీ ఖండించలేదు. బాధ్యులపై కఠిన చర్యలూ తీసుకోలేదు. పైగా చంద్రబాబు కావాలనే దాడులు చేయించుకుంటున్నట్లుగా మంత్రులు, వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.

attacks_on_chandrababu
attacks_on_chandrababu
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 8:33 AM IST

Updated : Apr 15, 2024, 9:26 AM IST

వైసీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబుపై రాళ్లదాడులు అనేకం - ఉల్టా బాబుపైనే కేసులు

Stone Attacks on Chandrababu During YCP Govt: జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత గల ప్రతిపక్ష నేత చంద్రబాబుపై జగన్‌ పాలనలో అనేక సార్లు వైసీపీ మూకల రాళ్ల దాడులు జరిగాయి. ఈ తరహా దుశ్చర్యలు రాష్ట్ర పోలీసుల వైఫల్యానికి నిదర్శనం.

2019 నవంబరు 29: వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి విధ్వంసానికి తెరలేపగా అక్కడి పరిస్థితుల్ని పరిశీలించి రైతులకు భరోసానిచ్చేందుకు 2019 నవంబరు 29న చంద్రబాబు రాజధానిలో పర్యటించారు. ఆయన రాకను నిరసిస్తూ వైసీపీ ప్రోద్బలంతో కొందరు ఆందోళన చేపట్టారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్‌లో నల్ల బ్యానర్లు కట్టారు. చంద్రబాబుతో పాటు సీనియర్‌ నేతలు ప్రయాణిస్తున్న బస్సుపైకి రాళ్లు, చెప్పులు విసిరారు. బస్సు ముందుభాగం, నాయకులు కూర్చున్న వైపు అద్దాలు పగిలాయి. ఈ అరాచకానికి బాధ్యులపై చర్యలు తీసుకోకపోగా నాటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అది వారికి రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛని వ్యాఖ్యానించారు.

2021 ఏప్రిల్‌ 12: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా 2021 ఏప్రిల్‌ 12న చంద్రబాబు తిరుపతిలో ప్రసంగిస్తుండగా దుండగులు ఆయనే లక్ష్యంగా రాళ్లు విసిరారు. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ రక్షణ వలయంలో ఉన్న తనకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని ఆనాడు బాబు మండిపడ్డారు. పోలీసులు దుండగులను పట్టుకోకపోవడాన్ని నిరసిస్తూ అక్కడే నేలపై బైఠాయించారు. చివరకు కాలినడకన ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.

2022 నవంబరు 4: ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో 2022 నవంబరు 4న బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రోడ్‌షోలో పాల్గొన్న చంద్రబాబుపై ఓ దుండగుడు భవనంపై నుంచి పూలతో పాటు పదునైన రాయి విసిరాడు. పూలను బలంగా విసురుతున్నట్లు గమనించిన ముఖ్య భద్రతాధికారి మధుసూదనరావు అప్రమత్తమై చంద్రబాబుకు అడ్డుగా నిలిచారు. మధు గవదపై దెబ్బతగిలి తీవ్ర రక్తస్రావమైంది. ఇది జరిగి ఏడాదవుతున్నా నిందితులెవరో గుర్తించలేదు. హత్యాయత్నం కేసు పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేయగా, పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 324 కింద సాధారణ కేసు పెట్టారు.

2023 ఏప్రిల్‌ 22: ప్రకాశం జిల్లాలో 2023 ఏప్రిల్‌ 22న చంద్రబాబు పర్యటించిన సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ సమక్షంలోనే రాళ్లదాడి జరిగింది. బాబు యర్రగొండపాలేనికి రాకుండా అడ్డుకోవాలని మంత్రి ముందుగానే వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఆయన తన క్యాంప్‌ కార్యాలయం వద్దకు నల్లదుస్తులతో వచ్చి చొక్కా విప్పి మరీ సవాల్‌ చేశారు. బాబు వాహనం వచ్చే సమయానికి దాదాపు 200 మంది రోడ్డు వెంట నిల్చొని గోబ్యాక్‌ అంటూ ప్లకార్డులు, నల్ల జెండాలు, నల్ల బెలూన్లు ప్రదర్శించారు.

చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది బుల్లెట్‌ ప్రూఫ్‌ షీట్‌లను అడ్డుపెట్టి, ఆయనకు రక్షణగా నిలవడంతో ముప్పు తప్పింది. ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌ సంతోష్‌కుమార్‌ తలకు రాయి తగిలి బలమైన గాయమైంది. మంత్రి సురేష్‌ దుశ్చర్యను సీఎం జగన్‌ ఖండించలేదు. దోషులపై చర్యలూ లేవు. పైగా టీడీపీ నేతలపైనే ఎదురు కేసులు పెట్టారు.

2023 ఆగస్టు 4: సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చంద్రబాబు 2023 ఆగస్టు 4న అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో పర్యటించారు. ఆరోజు ఉదయం నుంచే వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు చించేసి దాడులకు దిగిన దుండగులు చంద్రబాబు వచ్చాక ఏకంగా రాళ్ల దాడికి తెగబడ్డారు. పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. చంద్రబాబు అంగళ్లు నుంచి వెళ్లిపోయాక, వైసీపీ శ్రేణులు మళ్లీ రెచ్చిపోయి టీడీపీ నేతల కార్లను ధ్వంసం చేశాయి.

ఈ ఘటనలో చంద్రబాబును ఏ1గా పేర్కొంటూ, ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. అంగళ్లులో తనను చంపేందుకు వైసీపీ మూకలు ప్రయత్నించాయని, ఎన్‌ఎస్‌జీ కమాండోల రక్షణలో బయటపడ్డానని 2023 ఆగస్టు 13న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. 9 పేజీల లేఖతో పాటు తనపై దాడులకు ఆధారంగా 75 పేజీల డాక్యుమెంట్లు పంపించారు.

2023 సెప్టెంబరు 5: నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రపై పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరులో 2023 సెప్టెంబరు 5న వైసీపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డాయి. అడ్డుకోబోయిన టీడీపీ కార్యకర్తలను చితకబాదాయి. పోలీసులు యువగళం వాలంటీర్లను నియంత్రించారే తప్ప వైసీపీ శ్రేణులను అడ్డుకోలేదు. ఈ దాడిలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో పాటు పలువురు నాయకులు గాయపడ్డారు. ఓ కానిస్టేబుల్‌ తలకూ బలమైన గాయమైంది.

Last Updated : Apr 15, 2024, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.