ETV Bharat / politics

రాజ్యసభ నామినేషన్లకు ముగిసిన గడువు, ప్రధాన పార్టీల నుంచి ముగ్గురే అభ్యర్థులు - Rajya Sabha nominations telangana

Rajya Sabha nominations in telangana : రాజ్యసభ ఎన్నికలకు ఇవాళ నామినేషన్ల గడువు ముగిసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు గానూ ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం నాడు అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు.

Rajya Sabha Seats In Telangana
Rajya Sabha nominations in telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2024, 7:34 PM IST

Rajya Sabha nominations in telangana : రాష్ట్రంలో నేటితో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు మొత్తంగా వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయగా, బీఆర్ఎస్(BRS) తరఫున వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు.

ఇతర పార్టీలైన శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజరాజు కోయాల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ నామినేషన్ వేశారు. సదరు నామినేషన్లను శుక్రవారం నాడు అధికారులు పరిశీలించనున్నారు. శాసనసభలో ఎమ్మెల్యేల మద్ధతుతో రాజ్యసభకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పది మంది ఎమ్మెల్యేల బలం లేనందున జాజుల భాస్కర్, భోజరాజు కోయాల్కర్, కిరణ్ రాథోడ్ నామినేషన్లు తిరస్కరించే అవకాశం ఉంది.

తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్​

Rajya Sabha Elections 2024 Schedule : రాజ్యసభ ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్‌ విడుదలయింది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల ఎన్నికకు(Rajya Sabha Elections) కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎంపీలైన వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్‌, జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ల పదవీ కాలం ముగియడంతో వారి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Rajya Sabha Seats In Telangana : రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ రెండు, బీఆర్ఎస్ ఒక స్థానానికి పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు(Congress) సంఖ్యాపరంగా 64 మంది, మిత్రపక్షమైన సీపీఐకి ఒకరు, బీఆర్ఎస్ 39, బీజేపీ(BJP) 8, మజ్లిస్‌కు ఏడుగురు సభ్యుల బలం ఉంది. నిర్ణీత 39.6 శాతం ఓట్ల ప్రకారం కాంగ్రెస్‌కు ఒక స్థానం గెలిచే ఓట్లతో పాటు అదనంగా మరో 25 ఎక్కువ ఓట్లు ఉన్నందున అది రెండు స్థానాలకు పోటీ చేసే వీలుంది. బీఆర్ఎస్​కు ఒక స్థానం గెలిచిన తర్వాత అదనంగా మరో ఆరు ఓట్లే ఉన్నందున అది రెండో స్థానానికి పోటీ చేసే వీలు ఉండదు.

బీఆర్ఎస్‌ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర ఖరారు

తొలిసారిగా రాజ్యసభకు సోనియా గాంధీ - రాహుల్, ప్రియాంకతో వెళ్లి నామినేషన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.