Brother Anil's reaction On Viveka's murder : పోలింగ్ సమీపించిన తరుణంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తాజాగా వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా జగన్పై షర్మిల తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యోందంతం ఆ కుటుంబంలో మంటలు రేపుతోంది. ఈ క్రమంలో షర్మిల భర్త అనిల్ విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
జగన్ బంధుత్వాలకు అర్థం తెలుసా? చంపిన వాళ్లు నీ పక్కనే ఉన్నారు- వైఎస్ సునీత - ys viveka murder case
న్యాయానికి ఎప్పుడూ విజయం దక్కుతుందని, ఇక్కడ మేనేజ్ చేసుకున్నా దేవుడి దగ్గర శిక్ష తప్పదని షర్మిల భర్త బ్రదర్ అనిల్ అన్నారు. బద్వేల్లో విలేకరుల సమావేశంలో అనిల్ వివేకా హత్యపై స్పందించారు. వివేకా చాలా మంచి నాయకుడని, ఆయన హత్య చాలా బాధాకరమని, ఎవరి విషయంలోనైనా అలా జరగకూడదని అన్నారు. అంతిమ విజయం న్యాయానికే దక్కుతుందని చెప్పారు.
రాజు మంచిగా ఉంటే ప్రజలు మంచిగా ఉంటారని, మంచి మనసుతో వస్తే అందరికీ మంచి జరుగుతుందని తెలిపారు. పాలన సరిగా చేస్తే ప్రజలు హాయిగా ఉంటారని, డబ్బు వ్యామోహంతో కక్కుర్తి పడవద్దని కోరుతున్నానని అన్నారు. ఒక వ్యక్తికి ఓటు వేయాలని నేను దేవుడిని అడగనని, షర్మిలకు ఓటు వేయాలని నేను దేవుడిని కోరడం లేదన్నారు. కానీ, తన కమ్యూనిటీ తరఫున నిల్చుంటానని స్పష్టం చేశారు. ప్రతి మతానికి మార్గదర్శకాలు ఉంటాయని చెప్తూ తాను మతాన్ని ప్రకటించనని, సువార్త ప్రకటిస్తానని తెలిపారు. కమర్షియల్‌గా ఉండవద్దు, ప్రతి ఒక్కరినీ ప్రేమించాలని, ప్రజలకు మేలు చేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు.
బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు: వైఎస్ షర్మిల - YS Sharmila Blames Jagan
దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షాన ఉంటాడని తెలిపారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదంటూ డబ్బుతో అసత్యాన్ని సత్యం చేయలేము అని స్పష్టం చేశారు. కొందరు డబ్బు, పదవి కోసం అమ్ముడుపోతారని, తప్పును కప్పిపుచ్చుకోవడం దేవుడి దృష్టిలో తప్పు అని వివరించారు. ఎవరు ఏం చేసినా మనసుకు, మనిషికి తెలుసన్న అనిల్
ఎవరికీ చెడు, అన్యాయం చేయవద్దు.. న్యాయం చేయాలి అని కోరారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా వ్యక్తిగతంగా తీసుకోవద్దని, న్యాయం చేయడానికి దేవుడు అధికారం ఇచ్చారని అనుకోవాలని సూచించారు. రాజకీయంలో న్యాయం, అన్యాయం ఉంటుంది, అన్యాయం చేసినవారికి శిక్ష తప్పదు, ఇక్కడ మేనేజ్ చేసుకున్నా అక్కడ దేవుడి సన్నిధిలో శిక్ష తప్పదని హెచ్చరించారు.