RS Praveen Kumar Resigned from BSP state president Post : ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా 'కొత్తదారి ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా కొత్తదారిలో నడుస్తాను. రాజీనామా తప్ప నాకు మరో మార్గం కనిపించ లేదు. బరువైన గుండెతో బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఇటీవలి నిర్ణయాలు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్మి నాతో నడిచిన స్వేరోలను మోసం చేయలేను.' అని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.
దేశంలో మోగిన ఎన్నికల నగారా- 7విడతల్లో సార్వత్రిక పోరు- పోలింగ్, కౌంటింగ్ తేదీలివే
"పొత్తు (BRS-BSP Alliance) ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. మా పొత్తు గురించి వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ దాన్ని భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో సహా) చేస్తోంది. ఈ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ప్రస్థానాన్ని ఆపలేను. చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటా" అని ప్రవీణ్ కుమార్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇక బీఎస్పీదే అన్నారు.
ఏడు దశల్లో 2024 లోక్‌సభ ఎన్నికలు- జూన్ 4న కౌంటింగ్- పూర్తి షెడ్యూల్ ఇదే
కేసీఆర్‌తో ప్రవీణ్ కుమార్ భేటీ : బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. తన రాజకీయ భవిష్యత్‌పై(Political Future) నిర్ణయం ప్రకటించే అవకాశముంది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్, బీఎస్పీలు సీట్లపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. పొత్తులో భాగంగా బీఎస్పీకి హైదరాబాద్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ సీట్లను సైతం కేసీఆర్ కేటాయించిన సంగతి తెలిసిందే.
ఎన్నికల కోడ్ కథ తెలుసా? ఎప్పుడు ప్రవేశపెట్టారు? అమలుతో ఏం జరుగుతుంది?
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకం(Congress Six Guarantees) నామమాత్రంగా ఉందన్న ప్రవీణ్ కుమార్, తెలంగాణ ప్రజల భవిష్యత్‌కు గ్యారంటీ ఇవ్వలేకపోతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల హక్కలు పెను ప్రమాదాల్లో పడిందని, వాళ్లను కాపాడేది బీఎస్పీ-బీఆర్ఎస్ కూటమి మాత్రమేనని అన్నారు. ఈమేరకు బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి కూడా సుముఖంగా వ్యవహరించినా సరే, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ పార్టీ వీడటం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.
సార్వత్రిక ఎన్నికల బడ్జెట్ ఎంతో తెలుసా? ఎలక్షన్లకు అయ్యే ఖర్చు తెలిస్తే షాక్!