ETV Bharat / politics

రేపటి నుంచి మరింత బిజీ కానున్న రేవంత్ రెడ్డి - ప్రచార షెడ్యూల్ ఇదే - Congress Election Campaign

Congress Election Campaign in Telangana : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీల ఎన్నికల ప్రచార షెడ్యూలను పీసీసీ ప్రకటించింది. ఆదివారం నుంచి 10వ తేదీ వరకు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్ధతుగా సభలు, రోడ్ షోలలో పాల్గొంటారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

Congress Election Campaign Schedule 2024
Congress Election Campaign in Telangana (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 1:34 PM IST

Congress Election Campaign Schedule 2024 : రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ కీలక నేతలందరూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ పార్లమెంట్​ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా, ఎన్నికల ప్రచారంపై మరింత దృష్టిసారించిది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీల ఎన్నికల ప్రచార షెడ్యూల్​ను పీసీసీ ప్రకటించింది.

ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎన్నికల ప్రచారం షెడ్యూల్​ను వెల్లడించింది. ఈ నెల 6వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఇబ్రహీంపట్నం రోడ్ షో, కార్నర్ మీటింగ్​ల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్​లో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్నర్ సమావేశంలో పాల్గొని ప్రచారం చేస్తారు.

ఈ ఫైనల్స్​లో గుజరాత్‌ను ఓడిద్దాం - తెలంగాణను గెలిపించుకుందాం : సీఎం రేవంత్ ​రెడ్డి - CM Revanth Election Campaign

CM Revanth Election Campaign Schedule : ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటలకు నర్సాపూర్ జనజాతర సభలో సీఎం పాల్గొని నీలం మధుకి మద్దతుగా ప్రచారం చేస్తారు. సాయంత్రం 6.30 గంటలకు వరంగల్ ఈస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లలో పాల్గొని కడియం కావ్యకు మద్దతుగా ప్రచారం చేస్తారు. వెంటనే రాత్రి 7.45 గంటలకు వరంగల్ వెస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్​లో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగిస్తారు.

ఈ నెల 8వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఆర్మూర్ కార్నర్ మీటింగ్​లో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు నిజామాబాద్ రోడ్ షో, కార్నర్ మీటింగ్​లో పాల్గొని జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తారు. ఈ నెల 9వ తేదీన రాహుల్ గాంధీ, 10వ తేదీన ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Rahul,Priyanka Gandhi Election Campaign Schedule : ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు కరీంనగర్ జనజాతర సభ, సాయంత్రం 6 గంటలకు ఎల్బీనగర్, సరూర్ నగర్ స్టేడియంలో జన జాతర సభల్లో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి జన జాతర సభ, సాయంత్రం 4 గంటలకు తాండూరు జన జాతర సభలలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రచారం చేస్తారు. సాయంత్రం 6 గంటలకు షాద్ నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్​లో ప్రియాంక గాంధీ పాల్గొంటారని వివరించారు.

మోదీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డేనంటూ ప్రచారం : దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే ప్రధాన అంశంగా సీఎం రేవంత్​రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది, గాడిద గుడ్డేనంటూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అయిదు గ్యారెంటీ పథకాలు, వచ్చే ఆగస్టు పంద్రాగస్టు నాటికి రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రధాన అజెండాగా ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.

ప్రచార బరిలోకి కాంగ్రెస్ అగ్రనేతలు - పూర్తి షెడ్యూల్ ఇదే - lok sabha elections 2024

రేపు తెలంగాణలో రాహుల్​ గాంధీ పర్యటన - ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ - Rahul Gandhi Telangana Tour 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.