ETV Bharat / politics

వాళ్లిద్దరూ కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్‌ చేయబోతున్నారు- రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు - RaghunandanRao sensational comments

Raghanandan Rao Sensational Comments : దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘనందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హస్తం పార్టీలో చేరిన ఎంపీ రంజిత్‌రెడ్డి, జితేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు ఫండింగ్‌ చేయబోతున్నట్లు ఆయన ఆరోపించారు. వీరిద్దరు పార్టీ మారడం వెనుక వేలకోట్ల రూపాయలు చేతులు మారినట్లు పేర్కొన్నారు.

RaghunandanRao Fires on Jitender Reddy
Raghanandan Rao Sensational Comments
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 18, 2024, 8:32 PM IST

Raghanandan Rao Sensational Comments : రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని బీజేపీ నేత రఘునందన్‌ రావు(Raghanandan Rao) పేర్కొన్నారు. సమీకరణల మేరకు నేతలు పార్టీలు మారుతున్నారన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీ రంజిత్‌రెడ్డి(MP Ranjith Reddy), జితేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి ఫండింగ్‌ చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీరిద్దరు పార్టీ మారడం వెనక వేలకోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపించారు.

RaghunandanRao Fires on Jitender Reddy : ఇతర పార్టీల నుంచి నేతలు బీజేపీలోకి కూడా అలాగే వచ్చారని, బీజేపీలో చేరిన సమయంలో పార్టీ గురించి అద్భుతంగా మాట్లాడినట్లు రఘునందన్‌రావు పేర్కొన్నారు. బీజేపీ నుంచి బయటకు వెళ్లేటప్పుడు పార్టీపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీలో జితేందర్ రెడ్డి కుమారుడికి టికెట్ ఇస్తే సిద్దాంతాలు ఉన్న పార్టీనా..?, టికెట్ రాకపోతే సిద్దాంతాలు లేని పార్టీనా..? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీలోకి ఏ నిర్మాణ కంపెనీకి లాభం చేకూర్చుకునేందుకు ఇరువురు వెళ్లారని రఘునందన్‌రావు ప్రశ్నించారు. జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్​లోకి వెళ్లడం వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలు ఏంటీ? వాటి ద్వారా వారి ఆర్థిక ప్రయోజనాలు ఏంటీ? వారికి ఉన్న వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటీ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. సదరు విషయాలు తమకు అన్ని తెలుసని, అన్ని సమాచారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా అందరి కంటే ఎక్కువ లబ్ది పొందిన ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి జితేందర్‌రెడ్డి నిర్మాణ పనులు చేశారన్నారు. షేక్ పేటలో 443, 403 జరుగుతున్న భూ భాగోతాలపై ఈడీకి, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామన్నారు.

'తెలంగాణలో బీజేపీ పెరుగుతోంది - కాంగ్రెస్, బీఆర్ఎస్ తగ్గుతున్నాయి'

"కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీ రంజిత్‌రెడ్డి, జితేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి ఫండింగ్‌ చేయబోతున్నారు. జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్​లోకి వెళ్లడం వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలు ఏంటీ? వాటి ద్వారా వారి ఆర్థిక ప్రయోజనాలు ఏంటీ? వారికి ఉన్న వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటీ? . వీరిద్దరు పార్టీ మారడం వెనక వేలకోట్ల రూపాయలు చేతులు మారాయి. మావద్ద పక్క సమాచారం ఉంది. వీటిపై ఆర్ధిక దర్యాప్తు సంస్థలైన ఐటీ, ఈడీలకు ఫిర్యాదు చేస్తాము". - రఘునందన్ రావు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే

వాళ్లిద్దరూ కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్‌ చేయబోతున్నారు- రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ - బీఆర్​ఎస్​ ప్రయత్నాలు విఫలం

బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ మధ్య తెలంగాణ నలిగిపోయింది : ప్రధాని మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.