Raghunandan Rao Fires On Congress : మరోసారి కేంద్రంలో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాలన్నీ చుట్టేలా సంకల్ప యాత్రలతో(BJP Rath Yatra) జనాల్లోకి వెళ్తోంది. కాషాయ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయంటూ కుట్రపూరితమైన ప్రచారాలు చేస్తున్నారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రఘునందర్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా చాకరిమెట్ల హనుమాన్ ఆలయంలో పూజలు చేసిన ఆయన, సమీపంలోని తండాలో లంబాడా స్త్రీలతో కలిసి కాలు కదిపారు. అనంతరం వారు ఇచ్చిన రొట్టెల్లో పచ్చడి నంజుకుని తిన్నారు.
" 17 ఎంపీ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, జాతీయ అధ్యక్షుడు సైతం చాలా స్పష్టంగా చెప్పారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తులు ఉన్నట్లు మాట్లాడటం సరికాదు. లేని పొత్తుల గురించి మాట్లాడి, ప్రజలను అయోమయానికి గురిచేయటం తగదు."-రఘునందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే
నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ - రాష్ట్రంలో 10 మంది ఎంపీ అభ్యర్థిత్వాలపై రానున్న క్లారిటీ!
BJP Vijaya Sankalpa Yatra in Telangana : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే విధమైన ఆదేశాలు, పారదర్శక పాలన అందిస్తున్నామని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరిలో విజయ సంకల్ప సభలో పాల్గొన్న ఆయన కశ్మీర్లో సామాన్య ప్రజలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. మోదీ నేతృత్వంలో భారత్ వికసిస్తుందని, బీజేపీకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో నలిగిపోతున్న అయోధ్య కేసును ఛేదించి భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన ఘనత మోదీకే దక్కిందని రూపాల అన్నారు. బీజేపీ ప్రభుత్వంపై అసత్యపు ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు అవినీతి చేసిందో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని అరవై ఏళ్ల పాటు పాలించి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో(Parliament Election) వ్యతిరేకంగా ఓటు వేసి తగిన గుణపాఠం చెప్పాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం కార్యకర్తలతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు.
Chhattisgarh CM Vishnudev Sai Attend in Vijaya Yatra : భద్రాచలంలో విజయ సంకల్ప సభలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ పాల్గొన్నారు. అంతకుముందు ఆయన భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఘన స్వాగతం పలికిన అర్చకులు, శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఉపాలయంలో వేదాశీర్వచనం అందించారు.
బీజేపీ నయా స్కెచ్- నోటిఫికేషన్‌కు ముందే 100 మంది అభ్యర్థులతో తొలి జాబితా- మోదీ, షా సైతం!
రాహుల్ గాంధీ కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం ఆ పార్టీ అధికారంలోకి రాదు : కిషన్‌రెడ్డి