PV Narasimha Rao Family Meets PM Modi in Hyderabad : ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు. పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపినట్లు బీజేపీ నాయకులు ఎస్వీ. సుభాశ్ తెలిపారు. పీవీ కుటుంబ సభ్యులతో భేటీ అయిన చిత్రాన్ని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
PM Modi Latest Tweet : భారతీయ సంస్కృతి, సంప్రదాయలు తదతర అంశాలపై వారితో చర్చించినట్లు మోదీ తెలిపారు. ఇటీవల కాలంలో మన దేశం సాధిస్తున్న పురోగతిపై పీవీ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. పీవీ నరసింహారావుకు ఇటీవలే భారత ప్రభుత్నం భారతరత్న అవార్డును ప్రకటించింది. మార్చి 30 2024న పీవీ తరుఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
"హైదరాబాద్ చేరుకున్నాక మన మాజీ ప్రధాని, పండితుడు, రాజకీయ దురంధరుడు, శ్రీ పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులతో సమావేశం అద్భుతంగా జరిగింది. శ్రీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించినందుకు గాను వారు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మా సమావేశంలో అనేక విషయాలను విస్తృతంగా చర్చించుకున్నాం. ఇటీవలి కాలంలో భారతదేశం సాధించిన ప్రగతి పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశ సంస్కృతీ , సంప్రదాయాల ఔన్నత్యం గురించి కూడా మేము మాట్లాడుకున్నాం." అంటూ మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
-
హైదరాబాద్ చేరుకున్నాక మన మాజీ ప్రధాని, పండితుడు, రాజకీయ దురంధరుడు, శ్రీ పి వి నరసింహా రావు గారి కుటుంబ సభ్యులతో సమావేశం అద్భుతంగా జరిగింది. శ్రీ నరసింహా రావు గారికి భారత రత్న ప్రకటించినందుకు గాను వారు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ జేశారు . మా సమావేశం లో అనేక విషయాలను… pic.twitter.com/ChIPW5ri9w
— Narendra Modi (@narendramodi) May 7, 2024
విపక్షాలకు పాకిస్థాన్‌పై ఎందుకా ప్రేమ? భారత సైన్యంపై ద్వేషమెందుకు?: మోదీ - lok sabha elections 2024
PM MODI Telangana Tour Schedule : నేడు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వేములవాడ, వరంగల్‌లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్న మోదీ రాత్రి రాజ్‌భవన్‌లో బస చేశారు. ఎనిమిదిన్నర సమయానికి బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చేరుకుంటారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా ప్రచార సభలో మోదీ పాల్గొంటారని తెలిపారు. అనంతరం వరంగల్ పార్లమెంటు బీజేపీ అభ్యర్ధి అరూరి రమేశ్ గెలుపు కోరుతూ ప్రధాని మోదీ వరంగల్‌లో జరిగే సభలో పాల్గొననున్నారు. సభ అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ఏపీకి వెళ్లనున్నారు.