Pratidwani Debate on Former MLA pinnelli Anarchies: అరాచకశక్తికి అధికారం తోడైతే పేదప్రజలను ఏ విధంగా పీక్కుతినొచ్చో, సహజ వనరులను ఎలా కొల్లగొట్టొచ్చో చెప్పడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచి ఉదాహరణ. రౌడీయిజం, దొంగ ఓట్లు, బెదిరింపులు, హత్యలతో రెండు దశాబ్దాలపాటు మాచర్లను చెరబట్టిన పిన్నెల్లికి అదే ఆలోచన ధోరణి కలిగిన జగన్ తోడవ్వడంతో మరింత రెచ్చిపోయారు. జగన్ సర్కార్ గద్దెదిగటంతో చట్టానికి కోరలు వచ్చాయి. ఎన్నికల పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసంతో పాటు, అల్లర్ల కేసులో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే పిన్నెల్లి అరెస్టుతో ప్రశాంత పల్నాడుకు నాంది పడిందనుకోవచ్చా? మరోసారి రౌడీయిజం పేరు వినిపించకుండా చేయాలంటే ప్రభుత్వం ఇంకా ఏం చేయాలి? అనే విషయాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం. నేటి చర్చలో సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ డీవీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
గత వైఎస్సార్సీపీ పాలనలో పల్నాడును ప్రైవేటు సామ్రాజ్యంగా చేసుకున్న పిన్నెల్లి ప్రభుత్వ పెద్దల అండతో వ్యవస్థలను గుప్పిటపట్టారు. ఎస్పీ స్థాయి నుంచి హోంగార్డు వరకు అందరినీ తన చెప్పుచేతల్లో ఉంచుకుని అరాచక పాలన సాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కబ్జాల నుంచి సహాజ వనరులు కొల్లగొట్టడం, బెదిరించి ఆస్తులు లాక్కోవడం వరకు అన్నీ ఆయన కనుసన్నల్లోనే నడిచాయి. అక్రమ వ్యాపారాలు, భూదందాలు, గనుల అక్రమ తవ్వకాలతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. మాచర్ల నియోజకవర్గం పరిధిలో ఎలాంటి వ్యాపారాలు చేయాలన్నా పిన్నెల్లికి వాటా ఇవ్వాలి. స్థిరాస్తి వెంచర్లలో భాగం పంచాలి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 20 ఏళ్లపాటు పిన్నెల్లి సాగించిన అరాచకం అంతా ఇంతా కాదు.
జగన్ ఆడంబరాలకు ప్రజా ధనం - అయిదేళ్లు ప్రజా ఖజానాకు చిల్లు - Jagan Misused Public Money
ప్రభుత్వం మారడంతో ఎట్టకేలకు ఆ ఫ్యాక్షనిస్టు ఆటకు అడ్డుకట్ట పడింది. ఈవీఎం ధ్వంసంతో పాటు, అల్లర్ల కేసులో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. మాచర్లలో తెలుగుదేశం ఏజెంట్‌పై హత్యాయత్నంతో పాటు, కారంపూడి సీఐపై దాడి కేసులో పిన్నెల్లికి మాచర్ల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పటిష్ట భద్రత మధ్య మాచర్ల నుంచి నెల్లూరు సబ్ జైలుకు తరలించారు.
మాజీ ఎమ్మెల్యే అరెస్టైనా అతడి తమ్ముడు వెంకట్రామిరెడ్డి ఇంకా ఆచూకీ లేకుండా పరారీలోనే ఉన్నాడు. అతడిని పట్టుకోవడంతో పాటు అక్కడ పోలీసులు ఇంకా ఏం చేయాల్సి ఉంది? మాచర్ల నియోజకవర్గం కేంద్రంగా పిన్నెల్లి సోదరులు ఎలాంటి అవినీతి, నేరసామ్రాజ్యం సృష్టించారు? దానివల్ల ఆ ప్రాంతానికి జరిగిన నష్టం ఏమిటి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతడి సోదరుడిపై నమోదైన కేసులు తేలితే ఎలాంటి శిక్షలు పడొచ్చు? పైగా ఈవీఎం పగలగొట్టిన అలాంటి వ్యక్తిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంతకాలం ఎందుకు కాపాడింది? అనే అంశాలపై మరింత సమాచారం కోసం పై వీడియోపై క్లిక్ చేయండి.