ETV Bharat / politics

ప్రజలకు భరోసా కల్పిస్తోన్న ప్రజాదర్బార్ ​- నేనున్నానంటున్న నారా లోకేశ్ - Nara Lokesh Prajadarbar - NARA LOKESH PRAJADARBAR

Nara Lokesh Prajadarbar : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్​ చేపట్టిన ప్రజాదర్బార్​ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెడుతూ మంత్రిని కలుస్తుండగా వారికి లోకేశ్​ భరోసా కల్పిస్తున్నారు.

nara_lokesh_prajadarbar
nara_lokesh_prajadarbar (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 11:46 AM IST

Nara Lokesh Prajadarbar : విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్​ కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజాదర్బార్ కు తరలివచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరుతున్నారు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి, ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి వారికి భరోసా ఇస్తున్నారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

దివ్యాంగులకు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంజూరు చేసిన టిడ్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన ఆశయ సాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నారా లోకేశ్​ ను కలిసి విజ్ఞప్తి చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఇళ్లకు తాళాలు కూడా ఇవ్వకుండా వేధింపులకు గురి చేశారని తెలిపారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో తమ సొంతింటి కల నెరవేరేలా టిడ్కో ఇంటి రుణాన్ని మాఫీ చేయాలని యువనేతను కోరారు.

విమర్శలకు తావులేకుండా మెగా డీఎస్సీ నిర్వహించాలి - అధికారులను ఆదేశించిన మంత్రి లోకేశ్ - Nara Lokesh Review With Officials

సమస్యను విన్న నారా లోకేశ్​ చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తన కుమార్తెకు పూర్తిస్థాయి అంగవైకల్యం ఉందని, ఆ విధంగా దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన షేక్ భానుభి, దివ్యాంగ పెన్షన్ కోసం నులకపేటకు చెందిన ఆంజనేయులు లోకేశ్​ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పుట్టుకతో దివ్యాంగుడైన తాను డిగ్రీ చదివానని, ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎం. వంశీకృష్ణ కోరారు. గత ప్రభుత్వంలో నిలిపివేసిన రైతు కూలీ పెన్షన్ ను పునరుద్ధరించాలని యర్రబాలెం గ్రామానికి చెందిన ఎన్. వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు నీట్ పరీక్ష ద్వారా బీ-కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వచ్చిందిని, ఫీజు రాయితీ కల్పించి ఆదుకోవాలని పల్నాడు జిల్లా అనంతవరానికి చెందిన సీహెచ్.అనూష విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేశ్ భరోసా ఇచ్చారు.

"ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అవినీతి" మాకెందుకు చెడ్డపేరు?- స్పష్టం చేసిన మంత్రి లోకేశ్ - nara Lokesh Prajadarbar

రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ నిర్వహణ ఏర్పాట్ల పై మంత్రి నారా లోకేశ్ సమీక్ష - Nara Lokesh Review On Skill census

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.