POLL PERCENTAGE IN AP ELECTIONS : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ముగిసింది. ప్రజలు భారీగా ఓటెత్తి ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటిచెప్పారు. గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడి ఓటుహక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు, యువత విదేశాలతో పాటు మన దేశంలోని వివిధ నగరాల నుంచి లక్షల మంది స్వస్థలాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రధానంగా యువతరంలో ఉత్సాహం బాగా కనిపించింది. పోలింగ్ కేంద్రాల పరిధిలో సగటున రెండు నుంచి రెండున్నర గంటలపాటు క్యూలైన్లలో నిలుచోవాల్సి వచ్చినా ఓటర్లు తమ సంకల్పం వీడలేదు. మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా మధ్యాహ్నం వేళలోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసేటప్పటికి దాదాపు 3 వేల 500కు పైగా పోలింగ్ కేంద్రాల పరిధిలోని క్యూలైన్లలో ఒక్కోచోట కనీసం 100 నుంచి 200 మంది బారులు తీరి ఉండటంతో వారందరికీ ఓటేసే అవకాశమిచ్చారు. కొన్ని కేంద్రాల్లో రాత్రి పొద్దుపోయేదాకా పోలింగ్ కొనసాగింది.
భారీగా నమోదైన ఓటింగ్ శాతం - అర్ధరాత్రి వరకూ క్యూలైన్లలో జనం - Andhra Pradesh Elections 2024
తిరువూరు నియోజకవర్గం చింతలకాలనీలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గొటివాడ అగ్రహారం, విశాఖ జిల్లా పద్మనాభం మండలం, భీమునిపట్నంలోనూ పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఒంగోలు మండలం త్రోవగుంట పోలింగ్ కేంద్రం రాత్రి ఎనిమిదిన్నర సమయంలోనూ నిబంధనలు ఉల్లంఘించి ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేయడం వివాదాస్పదమైంది.
రాజకీయ పార్టీల నేతలు, నాయకులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 వరకు 9.21 శాతం పోలింగ్ నమోదు కాగా 11 గంటల వరకు 23 శాతం ఓటింగ్ నమోదయ్యింది. మధ్యాహ్నం 1గంట వరకు 40.26శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ శాతం మధ్యాహ్నం 3గంటలకు 55 శాతానికి పెరిగింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం 67.99 నమోదయ్యింది. అర్ధరాత్రి వరకు 78.40 శాతం పోలింగ్ నమోదయ్యింది.
లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలు- 67.70శాతం ఓటింగ్ నమోదు - LOK SABHA POLLS 2024
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీగా నమోదవుతోంది. పోలింగ్ ప్రారంభమైన ఆరు గంటల్లో 40.26 శాతం ఓటింగ్ నమోదైంది. అరకు,పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలో 4 గంటలకు పోలింగ్ ముగిసింది.
పోస్టింగ్‌లోనే కాదు - ఓటు హక్కు కల్పించడంలోనూ కక్ష సాధింపే - AB Venkateswara Rao Vote Issue