Political Leaders Rakhi Celebration in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ నేతలు పండుగను తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటున్నారు. ప్రజాపతినిధులకు తమ పార్టీకి చెందిన మహిళా నేతలు రాఖీలు కడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమయి కార్పొరేషన్ ఛైర్మన్లు శోభారాణి, శారద, సుజాత రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు.
సోదరి సీతక్కతో నా అనుబంధం…
— Revanth Reddy (@revanth_anumula) August 19, 2024
రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంత చల్లనిది.
ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతక్కతో పాటు…
రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి ఆనందాలు వెల్లివిరియాలని…
మనసారా కోరుకుంటున్నాను.#rakshabandhan2024 pic.twitter.com/6f3GIv4h7W
CM Revanth Rakhi Wishes : సోదరి సీతక్కతో తన అనుబంధం రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంత చల్లనిదని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతక్కతో పాటు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి ఆనందాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నానని సీఎం అన్నారు. ఆడబిడ్డలందరికి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Rakhi celebrations at home with dear sister @DeepaDasmunsi ji. #RakshaBandhanCelebration pic.twitter.com/dHDRqDpWYO
— Revanth Reddy (@revanth_anumula) August 19, 2024
కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎదురైనా, కలిసి ఉండేలా చేసె మంత్రం ఈ రక్షాబంధనం
— Ponnam Prabhakar (@Ponnam_INC) August 19, 2024
మినిస్టర్ క్వార్టర్స్ లో రక్షాబంధన్ సందర్భంగా సోదరీమణులతో వేడుకలు! pic.twitter.com/VDIkFAbQTY
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు తమ సోదరీమణులు రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆయన అక్కాచెల్లెల్లు రాఖీ కట్టి ఆశీర్వదించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తన సోదరీమణులతో కలిసి ఘనంగా రాఖీ వేడుకలు జరుపుకున్నారు. రక్షాబంధన్ పురస్కరించుకొని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు పలువురు మహిళలు రాఖీలు కట్టారు.
హైదరాబాద్ కోకాపేట్‌లోని ఆయన నివాసంలో పలువురు బీఆర్ఎస్ నేతలు, మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తనపై అభిమానం, ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపిన హరీశ్ రావు రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక అని అన్నారు. ఇలాంటి పండుగను అందరూ ప్రేమ, అభిమానాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు, మహిళల శ్రేయస్సు, భద్రత కోసం తన వంతు నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.
KTR Tweet on Kavitha Raksha Bandhan : సోదరి కవిత తనకు పండుగ నాడు రాఖీ కట్టలేకపోయినా ఆమెకు ఎప్పటికీ అండగా ఉంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాఖీ పౌర్ణమి పండుగ వేళ తన సోదరిని గుర్తు చేసుకుంటూ గతేడాది ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 'ఇవాళ రాఖీ కట్టలేకపోయినా ఎప్పటికీ అండగా ఉంటాను' అని క్యాప్షన్ జోడించారు. దిల్లీ మద్యం కేసులో కవిత తిహాడ్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు రాఖీ కట్టే వీలు లేకపోవడంతో కేటీఆర్ ట్వీట్ చేశారు.
రాఖీ పండుగ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా జరుపుకోవాలి? ఓన్లీ సొంతోళ్లకే కట్టాలా? - Rakhi Festival 2024