ETV Bharat / politics

ముగిసిన సార్వత్రిక ఎన్నికలు - ఉత్సాహంగా ఓటేసిన రాజకీయ ప్రముఖులు, అభ్యర్థులు - Leaders casting vote in Telangana - LEADERS CASTING VOTE IN TELANGANA

Telangana MP Election polling : రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, అభ్యర్థులు, ఇతర రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మాల్కాజిగిరి పరిధిలోనూ రాజకీయ ప్రముఖులు, అభ్యర్థులు ఓటేశారు.

Political Leaders and State Officials casted vote in Telangana
Telangana MP Election polling (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 13, 2024, 11:00 PM IST

ముగిసిన సార్వత్రిక ఎన్నికలు - ఉత్సాహంగా ఓటేసిన రాజకీయ ప్రముఖులు, అభ్యర్థులు (ETV Bharat)

Political Leaders and State Officials casted vote in Telangana : లోక్‌సభ ఎన్నికల్లో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఓట్ల పండుగలో భాగస్వామ్యమయ్యారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌లోని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మలక్‌పేట సలీంనగర్​లోని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి దంపతులు ఓటు వేశారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శాంతినికేతన్ గ్రౌండ్‌లో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బర్కత్‌పురాలో కమలం పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటేసిన నేతలు : సికింద్రాబాద్ బీఆర్​ఎస్​ అభ్యర్థి పద్మారావుగౌడ్ మోండా మార్కెట్‌లో ఈస్ట్ మారేడుపల్లిలోని కస్తూరిబా గాంధీ కళాశాలలో గులాబీ పార్టీ ఎమ్మెల్యే తలసాని ఓటేశారు. గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎస్​ఎస్​కే డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మహేంద్ర హిల్స్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఎనికేపల్లిలో చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, గొల్లపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి ఓటేశారు.

మేడ్చల్ మండల పాడూరు గ్రామ జడ్పీహెచ్​ స్కూల్​లో ​మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, హబ్సిగూడాలో మల్కాజిగిరి బీఆర్​ఎస్​ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తార్నాకలో టీజేఎస్​ అధ్యక్షుడు కోదండరాం, సికింద్రాబాద్‌లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓటేశారు. హైదరాబాద్ నందినగర్‌లో సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ఓటేసేందుకు వచ్చారు. జూబ్లీహిల్స్‌లో డీజీపీ రవి గుప్తా, ఎస్సార్​ నగర్‌లో సీఈవో వికాస్‌రాజ్, మాదాపూర్‌లో జీహెచ్​ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఓటు వేశారు.

కుటుంబ సమేతంగా ఓటేసిన మంత్రులు : బంజారాహిల్స్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సి.పార్థసారథి, డీఆర్​డీఓ మాజీ ఛైర్మన్‌ సతీశ్​రెడ్డి ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. కొడంగల్‌ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం గొల్లగూడెం పోలింగ్‌ కేంద్రంలో మంత్రి తుమ్మల, వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ, ములుగు జిల్లా జగ్గన్నపేటలో మంత్రి సీతక్క, ఖమ్మం జిల్లా నారాయణపురంలో మంత్రి పొంగులేటి, మధిరలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఓటువేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆర్టీసీ బస్సులో పోలింగ్ కేంద్రానికి వచ్చి మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రి శ్రీధర్‌బాబు ఓటు వేసి, స్థానిక పాన్ షాప్‌ వద్ద ప్రజలతో సరదాగా ముచ్చటించారు. నల్గొండలో కుటుంబ సభ్యులతో మంత్రి కోమటిరెడ్డి, కోదాడలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దంపతులు, సంగారెడ్డి జిల్లా జోగిపేట మంత్రి దామోదర రాజనర్సింహా ఓటు వేశారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నాగారంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హనుమకొండ టీచర్స్‌ కాలనీలో వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య ఓటేశారు.

Telangana Lok Sabha Elections Polling : సంగారెడ్డి జిల్లా మాడిగిలో జహీరాబాద్ బీఆర్​ఎస్​ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ రాజ్యాంగ కల్పించిన హక్కును ఉపయోగించుకున్నారు. బాన్సువాడ మండలం పోచారంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు ఓటు వేశారు. సిద్దిపేట జిల్లా బొప్పాపూర్‌లో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కుటుంబసభ్యులతో కలిసి మాజీ మంత్రి దేవందర్‌గౌడ్‌, వికారాబాద్‌ జిల్లా జిల్లా మర్‌పల్లిలో సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఓటువేశారు.

కొడంగల్​లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి - మంత్రులు ఎక్కడెక్కడ వేశారంటే? - CM Revanth Reddy Casted Vote

తెలంగాణ పోల్ డే - ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు వీళ్లే - TOLLYWOOD CELEBRATIES VOTES IN TS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.