ETV Bharat / politics

వైఎస్సార్సీపీ నేత నివాసంలో పోలీసుల సోదాలు - అరెస్టు భయంతో పరారీ - YSRCP LEADER GOUTHAM REDDY

గండూరి ఉమామహేశ్వరశాస్త్రిపై హత్యాయత్నం కేసు - వైఎస్సార్సీపీ నేత గౌతమ్‌రెడ్డి నివాసంలో పోలీసుల తనిఖీలు

searches_at_ysrcp_leader_home
searches_at_ysrcp_leader_home (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Police Searches at YSRCP Leader Gautam Reddy Home: వైఎస్సార్సీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి నివాసంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడకు చెేదిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం కేసులో గౌతంరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్​ను కోర్టు కొట్టేసిన నేపథ్యంలో పోలీసులు అయన నివాసంలో తనిఖీలు చేశారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో అరెస్టు చేస్తారని ప్రచారంతో గౌతమ్ రెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నారు.

తమ భూమిని కబ్జా చేసి భవనాన్ని నిర్మించారని గండూరి ఉమామహేశ్వర శాస్త్రి గతంలో గౌతమ్ రెడ్డిపై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో గౌతమ్ రెడ్డి కొంతమందికి సుపారీ ఇచ్చి ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తూ విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పలుమార్లు పోలీసులు గౌతమ్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవగా ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్​ను న్యాయస్థానం కొట్టివేసింది.

చంద్రబాబు మహా స్వాప్నికుడు - మరో పాతికేళ్లు రాజకీయ సుస్థిరత అవసరం : పవన్

ఎంపీ అవినాష్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్ - వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.