ETV Bharat / politics

ఇప్పటి వరకు నాలో మంచితనం చూశావు జగన్‌, ఇప్పటినుంచి యుద్ధం ఇస్తా: పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan Powerful Speech in Tadepalligudem Meeting: జగన్‌ కోట బద్దలు కొట్టి వైసీపీని అథఃపాతాళానికి తొక్కేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. సామాన్యుడి రాజకీయాన్ని తట్టుకోలేకనే పొత్తుపై రకరకాల కథలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన కూటమి విజయం ఖాయమన్నారు. పొత్తులపై తన నిర్ణయాన్ని ప్రశ్నించే వారు సలహాలు ఇచ్చేవారు తనకు అక్కర్లేదని తన వెంట వచ్చే వాళ్లే తనవాళ్లన్నారు. అన్నీ ఆలోచించే విస్తృత ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామన్నారు.

pawan_kalyan_powerful_speech
pawan_kalyan_powerful_speech
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 7:26 AM IST

ఇప్పటి వరకు నాలో మంచితనం చూశావు జగన్‌, ఇప్పటినుంచి యుద్ధం ఇస్తా: పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan Powerful Speech in Tadepalligudem Meeting: అధికారం తమ ఫ్యాక్షన్‌ కోటల్లోనే ఉండాలనే ఆధిపత్యపు ధోరణి వైసీపీదని జనసేనాని పవన్ కల్యాణ్​ ధ్వజమెత్తారు. సామాన్యుడి రాజకీయాన్ని తట్టుకోలేరని వ్యూహాలు, పొత్తులు పెట్టుకుంటే భరించలేరని దుయ్యబట్టారు. అన్నీ అర్ధం చేసుకునే 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలతో పొత్తు పెట్టుకున్నామని కార్యకర్తలకు చెప్పారు. 2024 ఎన్నికలకు మహాయుద్ధం ప్రకటిస్తున్నానని పవన్​ అన్నారు.​ వైసీపీ గడీల్ని బద్దలు కొడదామని, జనసేన, టీడీపీ పొత్తు గెలవాలని ఆకాంక్షించారు. జగన్‌లా తన వద్ద వేలకోట్లు లేవని టీడీపీలా సంస్థాగత బలములేదని వెల్లడించారు. అన్ని స్థానాల్లో పోటీ చేస్తే పోల్‌మేనేజ్‌మెంట్‌ చేయలేమని జనసైనికులు అర్ధం చేసుకోవాలని వివరించారు.

వైఎస్సార్సీపీ గుండాలు రెచ్చిపోతే ఎముకలు విరగ్గొడతాం: పవన్ కల్యాణ్

నా వెంట నడిచేవాళ్లే నావారవుతారు: సొంత బాబాయిని చంపినా చెల్లెల్ని గెంటేసినా, వేలకోట్లు అవినీతి పాల్పడిన జగన్‌ను వెనకేసుకొస్తున్నారని రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను తీసుకున్న నిర్ణయాలను ఎందుకు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. మద్దతుదారుల పేరుతో తనకు సలహాలిచ్చేవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోల్ మేనేజ్‌మెంట్‌ చేసే సత్తా మనకు ఉందా? అని ప్రశ్నించారు. నిజంగా తన మద్దతుదారులైతే తనతో నడవాలి కానీ తనను ప్రశ్నించొద్దని హితవు పలికారు. పవన్‌ కల్యాణ్‌తో స్నేహం అంటే చచ్చేదాకా ఉంటుందని, శత్రుత్వం అంటే అవతలివాడు చచ్చేదాకా’ అని స్పష్టం చేశారు.

టీడీపీ-జనసేన విన్నింగ్‌ టీమ్‌ - వైఎస్సార్సీపీ చీటింగ్‌ టీమ్‌: చంద్రబాబు

చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం: ఐదు కోట్ల ప్రజలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్‌ జగన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర, పశ్చిమ, తూర్పుగోదావరి, అనంతపురం, కర్నూలు ఎక్కడికి వెళ్లినా పంచాయతీలు చేసేది అయిదుగురేనని ధ్వజమెత్తారు. క్లైమోర్‌మైన్‌ పేల్చితే 16 అడుగుల ఎత్తుకు ఎగిరిపడినా పైకిలేచి దుమ్ము దులిపి పదండి రాజకీయం చేద్దామని పలికిన రాజకీయ దురంధరుడు చంద్రబాబు అని పవన్‌ కల్యాణ్‌ ప్రశంసించారు. నవ నగరాన్ని నిర్మించి ఉపాధి కల్పించిన వ్యక్తి, పారిశ్రామికవేత్తల్ని తరలించిన చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమనే ఆయనతో పొత్తు పెట్టుకున్నానని వివరించారు.

టీడీపీ-జనసేన సభకు భారీ స్పందన - 10 కి.మీ మేర నిలిచిన వాహనాలు

పవన్‌ కల్యాణ్‌ అంటే ప్రజల కన్నీళ్లు తుడిచే చేయి: జగన్‌ బతుకు జూబ్లీ హిల్స్‌ సొసైటీ ఏర్పడిన నాటి నుంచి తెలుసు అని పవన్ కల్యాణ్​ విమర్శించారు. అక్కడి చెక్‌పోస్టులో ఏం చేసేవాడో నాకు తెలుసు బంజారాహిల్స్‌లోని కొంటికి రెస్టారెంట్‌లో ఏం చేసేవాడో నాకు తెలుసని పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. తన వ్యక్తిగత జీవితం గురించి జగన్‌ మాట్లాడుతుంటారు. అతని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే టన్నులు టన్నులు ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు తనలో మంచితనం చూశావు జగన్‌ నీకు యుద్ధం ఇస్తాను మర్చిపోకు అని హెచ్చరించారు. పవన్‌ కల్యాణ్‌ అంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్తుతో పాటు ఈ దేశపు యువత కలలు, ప్రజల కన్నీళ్లు తుడిచే చేయని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.