Pawan Kalyan Comments on YS Jagan in Tenali Sabha: జగన్‌కు గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లుగా వైసీపీ నాయకులు హడావుడి చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల బాలుడు అమర్‌నాథ్ తన అక్కను వేధించవద్దని అన్నందుకు వైసీపీ కార్యకర్త నిర్దాక్షిణ్యంగా పెట్రోలు పోసి తగలబెడితే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడే దాడుల ఘటలు జరుగుతాయా అని ఏపీలోని తెనాలి సభలో ధ్వజమెత్తారు.
తెనాలి వారాహి విజయభేరీ బహిరంగ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Pawan Kalyan Election Campaign) జగన్‌పై విరుచుకుపడ్డారు. ఎన్నికలు రాగానే వైఎస్ జగన్‌కు ఏదోలా గాయమవుతుందని ఎవరో ఒకరు చనిపోతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. మాజీమంత్రి వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపేస్తే గుండెపోటు అని చెప్పారన్నారు. షర్మిల, సునీత న్యాయం చేయమని కోరితే వారిని జగన్ కించపరుస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే కూటమిగా వచ్చినట్లు వివరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీపీఎస్‌పై అసెంబ్లీలో చర్చ పెడతామని పవన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికుల నిధి డబ్బులు 450 కోట్లను జగన్(CM Jagan) దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక దొరకకుండా చేసి 21 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు 34 నుంచి 24 శాతానికి తగ్గించి వారిని అధికారానికి దూరం చేశారని విమర్శించారు. ఎస్సీలకు 27 పథకాలు రద్దు చేసి 4,163 కోట్లు మళ్లించారని ధ్వజమెత్తారు.
'డాక్టర్' చరణ్‌కు పవర్‌స్టార్ స్పెషల్ విషెస్- ఆయన రియాక్షన్ ఇదే! - Ram Charan Pawan Kalyan
నేను మీ కూలీని : ఒక ఆశయం కోసం వచ్చిన తనకు ఓటమి బాధ ఎలా ఉంటుందో ప్రజలకు తెలుసని పవన్ అన్నారు. రెండు చోట్లా ఓడిపోయినా తట్టుకుని ముందుకెళ్తున్నానని, ప్రజలు మోసం చేశారని తానేమి వెనక్కి తగ్గలేదని తెలిపారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం మళ్లీ జనం మధ్యకు వచ్చానని, వకీల్ సాబ్ చెప్పినట్టు తాను ప్రజల కూలీని అని, అధికారం ఇస్తే సంతోషంగా పని చేస్తానని, ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాలు చేయట్లేదని తెలిపారు.
కూటమి ప్రభుత్వం రాగానే ఉద్యోగులకు 5వ తేదీలోపు జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారు. వ్యాపార వర్గాలకు అండగా ఉంటామని, ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించే విధంగా పథకాలకు రూపకల్పన చేస్తామని అన్నారు. కేవలం కులగణనే కాదు, ప్రతిభను గణించి మహిళలను ప్రోత్సహిస్తామని, ప్రతి మహిళ ఏదో ఒక నైపుణ్యం పెంచుకోవాలని, ప్రతి గ్రామంలో మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తాం ప్రకటించారు. కౌలు రైతులకు చేస్తున్న సాయం చిరంజీవిని కదిలించింది.
ఏపీలో 160 స్థానాల్లో కూటమి విజయం ఖాయం : చంద్రబాబు - Chandrababu At TDP workshop