Pawan Kalyan Election Campaign From PithaPuram : దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిశాయని జనసేన అధనేత పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ఫ్యాన్‌కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువని ఎద్దేవా చేశారు. తన కోసం సీటు త్యాగం చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వర్మకు ధన్యవాదాలు తెలిపారు.
పిఠాపురాన్ని గుండెల్లో పెట్టుకుంటా : పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా అనుకోలేదని, ఎంతో విశిష్ఠత కలిగిన నేల ఇదని పవన్ కల్యాణ్ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకునేందుకు వచ్చానని అన్నారు. అధికారంలోకి రాగానే ఇక్కడి ఆసుపత్రులన్నీ బాగు చేస్తానని, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తా హామీ ఇచ్చారు. తన సన్నిహితులతో మాట్లాడి ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టిస్తానని తెలిపారు. మోడల్ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతానని, పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. ఓడినా దశాబ్దం నుంచి ఒంటరిగా పోరాటం చేస్తున్నానని గుర్తు చేశారు. తనను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి వైఎస్సార్సీపీ నేత మిథున్‌రెడ్డి వచ్చారని, మండలానికి ఓ నాయకుడిని పెట్టారని, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారని తెలిపారు.
వారాహికి పోలీసుల అనుమతి నిరాకరణ - పవన్ కల్యాణ్ పూజలు రేపటికి వాయిదా - No Permission to Pawan Varahi
యువతకు రూ.5 వేల జీతం కావాలా? 25 ఏళ్ల భవిష్యత్తు కావాలా? : కాకినాడ సెజ్‌కు భూములు ఇచ్చిన రైతులకు మేలు జరగలేదని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పాడ తీరం కోతకు గురవుతుంటే వైఎస్సార్సీపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. రకరకాల దోపిడీలు చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి పేదలట అని ఎద్దేవా చేశారు. కాకినాడ పోర్టు, డ్రగ్స్, బియ్యం, డీజిల్ మాఫియాకు అడ్డాగా మారిందని, ఎన్నికల ఖర్చుకు కావాల్సిన డబ్బును ఆ పోర్టులోనే దాచారని ఆరోపించారు. యువతకు రూ.5 వేల జీతం కావాలా? 25 ఏళ్ల భవిష్యత్తు కావాలో తెల్చుకోవాలని అన్నారు. జగన్ మాయమాటలకు మోసపోకండని, జగన్ అవినీతిపరుడని, గద్దె దించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే కూటమిగా వచ్చామని గుర్తు చేశారు. కూటమి కావాలో వైఎస్సార్సీపీ కావాలో ప్రజలు ఆలోచించాలి అని ఆయన కోరారు.
రెండు విడతలుగా జనసేనాని ఎన్నికల ప్రచారం - రేపటి నుంచే ప్రారంభం - Pawan Kalyan Election Campaign
Pawan Kalyan Election Campaign Schedule : పవన్ పోటీ చేసే పిఠాపురంలో రెండు విడతలుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 2 వరకు పిఠాపురం, మళ్లీ ఏప్రిల్ 9న పిఠాపురంలో నిర్వహించే ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8 కాకినాడ గ్రామీణం, 10న రాజోలు, 11 పి గన్నవరం, 12 రాజానగరంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ఇది మొదట విడత జరిగే ప్రచార కార్యక్రమని తెలిపారు. ఇది పూర్తైన వెంటనే రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నారు.
ఈసారి పీఠం కూటమిదే - పిఠాపురంలో స్పష్టం చేసిన పవన్ - Pawan kalyan Pithapuram Tour