Palnadu District TDP President GV Anjaneyulu : ఏ చెల్లికీ అన్నగా ఉండడానికి అర్హత లేని వ్యక్తి జగన్ అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. సొంత చెల్లెల్ని నిందించే వ్యక్తిని ఏమనాలి ? అని ఆయన ప్రశ్నించారు. బాబాయి హత్య కేసు నిందితుడిని చంకలో పెట్టుకోవడమే గాకుండా ఎన్నికల్లో టికెట్ ఇచ్చి మంచోడని ఎలా సర్టిఫికెట్ ఇస్తున్నారని నిలదీశారు. వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసన్న జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ అధికారంలో ఉన్న ఐదేళ్లుగా ఏం చేశారు? అని జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. సీబీఐ అరెస్టు చేసి బెయిల్‌పై ఉన్న వ్యక్తి మంచోడయ్యాడా? జగన్, అవినాష్ మళ్లీ గెలిస్తే హంతకులకు లైసెన్స్ ఇచ్చినట్లే అని దుయ్యబట్టారు.
పల్నాడు జిల్లాకు జగన్ తీరని అన్యాయం చేశారు: జీవీ ఆంజనేయులు - GV Anjaneyulu fire on CM Jagan
జగన్ సైకో పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు : టీడీపీ నేత జీవీ ఆంజనేయులు