ETV Bharat / politics

చిరుద్యోగులపై ఇంత పగా? - పీర్జాదిగూడలో పేదల ఇళ్ల కూల్చివేతపై భగ్గుమన్న విపక్షాలు - Peerzadiguda Houses Demolition

Opposition Parties React on Peerzadiguda Houses Demolition : హైదరాబాద్‌ శివారు పీర్జాదిగూడ కార్పొరేషన్‌ పర్వతాపూర్‌లో పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. అక్రమ కూల్చివేతలను ఖండిస్తున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వేరువేరుగా స్పందించారు. నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై కక్షగట్టి చేస్తున్న వేధింపులకు ప్రజలు ముగింపు పలకడం ఖాయమని ఉద్ఘాటించారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 5:48 PM IST

Updated : Jul 8, 2024, 6:54 PM IST

KTR Tweet on Peerzadiguda House Demolition
Etela Rajender Comments on Congress (ETV Bharat)

Malkajgiri MP Etela React on Peerzadiguda House Demolition : అక్రమ కట్టడాల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పీర్జాదిగూడ మున్సిపాలిటీలోని చిరుద్యోగుల ఇళ్లు కూల్చివేస్తోందని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమ కూల్చివేతలను ఖండిస్తున్నట్లు తెలిపారు.

సాయిప్రియ ఎన్‌క్లేవ్‌లో చిన్న చిన్న ఉద్యోగులు, నిరుపేదలు 30 ఏళ్ల కిందట భూములు కొనుగోలు చేశారని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అక్కడున్న నిర్మాణాలను అకారణంగా కూల్చుతున్నారని దుయ్యబట్టారు. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయటం దారుణమన్నారు.

Etela Rajender Fires on Congress Party : అవి అక్రమ భూములు అయితే, ఆనాడు ఇళ్ల నిర్మాణానికి, గృహ రుణాలకు ఎలా అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించాల్సిన ప్రభుత్వం, హింసకు గురిచేయడం సబబు కాదన్నారు. కాంగ్రెస్‌ వైఖరి వల్ల 300 మంది చిరుద్యోగులు రోడ్డున పడ్డారన్న ఆయన, 30, 40 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూముల విషయంలో ఇప్పుడు కలుగజేసుకోవటం సరికాదని ఆక్షేపించారు.

"రెక్కాడితే కానీ డొక్కాడని ఆ పేదవాళ్లు, 30 యేళ్ల క్రితం పీర్జాదీగూడలో భూములను కొనుక్కున్నారు. వాళ్లకు అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అకారణంగా కట్టుకున్న ఇళ్లను కూల్చివేసింది. అడిగే నాథుడు లేడు. కూలగొట్టిన ఆ ఇళ్లకు పరిహారం చెల్లించాలి. అదేవిధంగా అప్పుడు అనుమతులు ఇచ్చిన కలెక్టర్​పై చర్యలు తీసుకోవాలి."-ఈటల రాజేందర్, బీజేపీ ఎంపీ

పేదల ఇళ్లను కూల్చివేసేందుకే ప్రజలు అధికారం ఇచ్చారా? : ఈ ప్రాంతంలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూల్చిన ఇళ్లకు పరిహారం అందజేసి బాధితులకు క్షమాపణలు చెప్పాలన్నారు. నాటి కేసీఆర్ ప్రభుత్వమైనా, నేటి రేవంత్ సర్కారైనా పేదలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. గతంలో కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడితేనే ఓడిపోయారని గుర్తు చేశారు.

ఈ కూల్చివేతలలో రాజకీయ కక్ష కనిపిస్తుందన్నారు. ఈ సమస్యపై మాట్లాడటానికి అధికారులు, మంత్రులకు ఫోన్‌ చేస్తే వారు మాట్లాడటం లేదని మండిపడ్డారు. పీర్జాదిగూడలో పేదల ఇళ్లు కూల్చేయడం దారుణమని, ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని బీజేపీ కచ్చితంగా అడ్డుకుంటుందని ఈటల స్పష్టం చేశారు.

KTR React on Peerzadiguda House Demolition : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై కక్షగట్టి చేస్తున్న వేధింపులకు ప్రజలు ముగింపు పలకడం ఖాయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో ఇళ్ల కూల్చివేత అంశంపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్, నిఘా విభాగం నివేదికలు తెప్పించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

కాంగ్రెస్ నాయకులు అమ్మిన, కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిన ప్లాట్లలో నిర్మించుకుంటున్న ప్రజల ఇండ్లను మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏమి ఆశించి కూలగొట్టించారో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా పాలనలో ప్రజలకు మద్దతు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా అని ప్రశ్నించిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డికి అన్నగా ప్రచారం చేసుకుంటూ సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో చేస్తున్న అరాచకాలపై నిఘా విభాగం నివేదిక తెప్పించుకోవాలని కోరారు. లేదంటే ప్రజలు తిరగబడతారని, నిర్బంధాలు ప్రజాగ్రహాన్ని నిలువరించలేవని కేటీఆర్ పేర్కొన్నారు.

సన్నవడ్లకు మాత్రమే బోనస్‌ ప్రకటనపై మాటల యుద్ధం - ప్రతిపక్షాల ఫైర్ - Small Grain Bonus Controversy in TS

'వారసత్వ రాజకీయాలను బీజేపీ ప్రోత్సహించదు - ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో అధిష్ఠానానికి బాగా తెలుసు' - MP Etela Rajendar Latest Comments

Last Updated : Jul 8, 2024, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.