Niranjan Reddy Fires on Congress Govt : అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతలు అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు దేశంలోనే అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించకపోగా, ప్రజలు, ప్రజా సంఘాలు వెళ్లకుండా స్మృతి వనానికి తాళాలు వేయడం దుర్మార్గమని ఆక్షేపించారు. కేవలం కేసీఆర్ పెట్టాడన్న అక్కసుతో ఇలా వ్యవహరిస్తారా? అని నిలదీశారు. కేసీఆర్ కట్టిన వాటి పట్ల వ్యతిరేకత ఉంటే రేపట్నుంచి సచివాలయంలో కూర్చోవడం మానేయాలన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కాంగ్రెస్ తీరుపై ధ్వజమెత్తారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి అనాది నుంచి అంబేడ్కర్ మీద గౌరవం లేదని, ఇది చరిత్ర చెబుతున్న సత్యమని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. స్వయంగా అంబేడ్కర్ పోటీ చేస్తే ఓడించిన ఘనత ఆ పార్టీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. హస్తం హయాంలో రాజ్యాంగ నిర్మాతకు భారతరత్న ఇవ్వడానికి మనసు ఒప్పలేదన్న ఆయన, ఇది కాంగ్రెస్ పార్టీకి అంబేడ్కర్ పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. అంబేడ్కర్‌ను అవమానించడం అంటే, రాజ్యాంగాన్ని, పౌరులను అవమానించడమేనన్నారు. కాంగ్రెస్ వ్యవహరించిన తీరు పట్ల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నష్టపోయిన రైతులకు రూ.10 వేల పరిహారం వెంటనే ఇవ్వాలి : నిరంజన్ రెడ్డి
'బీఆర్ఎస్ నేతలనే చేర్చుకుని అభ్యర్థులు ప్రకటించే దుస్థితికి బీజేపీ, కాంగ్రెస్ వచ్చాయి'
మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడిందన్న కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యలపైనా నిరంజన్ రెడ్డి స్పందించారు. బీజేపీ మీద పోరాడే దమ్ము ఆ పార్టీకి లేదన్నారు. ఇక నుంచి పోరాటం భారతీయ జనతా పార్టీపై అని కేసీ చెప్పడం హాస్యాస్పదమన్న ఆయన, మరి ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలు వేణుగోపాల్‌కు అర్థం కావని, హస్తం పార్టీకి ఓట్లు, సీట్లే తెలుసని ఎద్దేవా చేశారు. భారత్ రాష్ట్ర సమితి లేదనడం కేసీ అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు.
'కాంగ్రెస్ మిషన్ 15 అంటున్నారు. వేణుగోపాల్‌కు చేతనైతే రేవంత్ సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి, ఇంఛార్జీగా ఉన్న చేవెళ్ల, సొంత స్థానం మహబూబ్‌నగర్‌ను ఇక్కడ ఉండి గెలిపించుకోవాలి. పాలనను గాలికి వదిలేసి, కాంగ్రెస్ నేతలు కండువాలు కప్పడంలో బిజీగా ఉన్నారు. పంటలు ఎండుతుంటే ఐపీఎల్ మ్యాచులకు వెళ్తారా? కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.' - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి
గత ప్రాజెక్టులు పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని బేషజాలకు పోతున్నారు: నిరంజన్‌రెడ్డి
కేసీఆర్ సీఎంగా లేకపోవడాన్ని పార్టీ నాయకులు, ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు : నిరంజన్‌రెడ్డి